అక్కడక్కడే- మెటల్‌, బ్యాంక్స్‌ డీలా!

అక్కడక్కడే- మెటల్‌, బ్యాంక్స్‌ డీలా!

స్వల్ప హెచ్చుతగ్గుల నడుమ కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న మార్కెట్లు ప్రస్తుతం అక్కడక్కడే అన్నట్టుగా కదులుతున్నాయి. సెన్సెక్స్‌ 11 పాయింట్లు బలపడి 33,573కు చేరగా.. నిఫ్టీ నామమాత్రంగా 2 పాయింట్లు పెరిగి 10,344ను తాకింది.
ఐటీ అండ
మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో రంగాలు 0.35 శాతం చొప్పున బలహీనపడగా.. ఐటీ 1 శాతం పుంజుకోవడం ద్వారా మార్కెట్లను ఆదుకుంటున్నాయి. ప్రధానంగా ఇన్ఫోసిస్‌ 2.5 శాతం, ఆర్‌ఐఎల్‌ 1.5 శాతం చొప్పున లాభపడటంతో ఇండెక్సులకు బలమొచ్చింది. ఈ బాటలో హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌పీసీఎల్‌, ఐషర్‌, పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్, యాక్సిస్‌ 1.6-0.8 శాతం మధ్య పెరిగాయి. అయితే అదానీ పోర్ట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో, హిందాల్కో, గెయిల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐబీ హౌసింగ్‌, అల్ట్రాటెక్‌ 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి.Most Popular