యూరోపియన్‌ మార్కెట్ల నేలచూపు!

యూరోపియన్‌ మార్కెట్ల నేలచూపు!

నేడు థాంక్స్‌ గివింగ్‌ డే సందర్భంగా అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. యూరప్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి.  ప్రస్తుతం యూరప్‌ మార్కెట్లలో ఫ్రాన్స్‌ నామమాత్రంగా నష్టపోగా.. జర్మనీ 0.36 శాతం, యూకే 0.46 శాతం చొప్పున క్షీణతతో ట్రేడవుతున్నాయి. బ్లూచిప్‌ సంస్థలు సెంట్రికా, థిస్సన్‌క్రుప్‌, రోవియో క్యూ3 ఫలితాలు ప్రకటించనుండగా... యూరోజోన్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు వెలువడనున్నాయి. 
అక్టోబర్‌ సమీక్షకు సంబంధించిన ఫెడ్‌ మినిట్స్‌ వెల్లడయ్యాయి. డిసెంబర్‌లో చేపట్టనున్న సమీక్షలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచనున్న సంకేతాలు ఇచ్చినప్పటికీ ద్రవ్యోల్బణంపట్ల కొంతమేర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.Most Popular