భూషణ్‌ స్టీల్‌పై జేఎఫ్‌ఈ కన్ను?!

భూషణ్‌ స్టీల్‌పై జేఎఫ్‌ఈ కన్ను?!

రుణ ఊబిలో కూరుకుని దివాళావైపు సాగుతున్న భూషణ్‌ స్టీల్‌ ఆస్తుల కొనుగోలుకి జపాన్‌కు చెందిన జేఎఫ్‌ఈ హోల్డింగ్స్‌తో కలసి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సంయుక్తంగా బిడ్‌ దాఖలు చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో భూషణ్‌ స్టీల్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 2.3 శాతం బలపడి రూ. 75 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క జేఎస్‌డబ్ల్యూ  స్టీల్‌ సైతం 0.6 శాతం పుంజుకుని రూ. 270 వద్ద కదులుతోంది.
ఎస్‌పీవీ
ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లో 15 శాతం వాటా కలిగిన జేఎఫ్‌ఈ.. భూషణ్‌ స్టీల్‌ ఆస్తుల కొనుగోలుకి ఎస్‌పీవీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్‌పీవీలో జేఎఫ్‌ఈ మెజారిటీ వాటా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.Most Popular