యాడ్‌లేబ్స్‌కు దమానీ దన్ను!

యాడ్‌లేబ్స్‌కు దమానీ దన్ను!

డీమార్ట్‌ స్టోర్ల ప్రమోటర్‌ రాధాకృష్ణన్‌ దమానీ.. యాడ్‌లేబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన ఫైవ్‌స్టార్‌ లగ్జరీ హోటల్‌ కొనుగోలుని పూర్తి చేసినట్లు వెల్లడికావడంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో యాడ్‌లేబ్స్‌ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 70.35 వద్ద నిలిచింది. 
రూ. 212 కోట్లు
ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఉన్న హోటల్‌ నోవోటెల్‌ ఇమాజికా ఖూప్లీని విక్రయించినట్లు యాడ్‌లేబ్స్‌ ప్రమోటర్‌ మన్‌మోహన్ షెట్టీ పేర్కొన్నారు. తద్వారా రుణ భారాన్ని తగ్గించుకోనున్నట్లు తెలియజేశారు. బ్రైట్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ద్వారా దమానీ 287 గదులున్న ఈ హోటల్‌ను రూ. 212 కోట్లకు కొనుగోలు చేశారు. Most Popular