పవర్ స్టాక్స్‌లో ఈ 4 స్టాక్స్ 34% లాభం ఇస్తాయట

పవర్ స్టాక్స్‌లో ఈ 4 స్టాక్స్ 34% లాభం ఇస్తాయట

కేంద్రప్రభుత్వం విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరింత బలపరుస్తామని ప్రకటించింది. డిస్కమ్‌ల పనితీరుతో పాటు ఆర్ధిక స్థితిని కూడా మెరుగుపరుస్తామని కేంద్ర విద్యుత్ శాఖ కార్యాలయం చెప్పడంతో ఈ రంగంలోని కొన్ని స్టాక్స్ బాగా  పెరుగుతాయని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది.వాటిలో పవర్‌గ్రిడ్, ఎన్‌టిపిసి వంటి బలమైన ఎర్నింగ్స్ గ్రోత్  పొటెన్షియల్ ఉన్నాయని రికమండ్ చేస్తోంది.  వీటితో పాటు  సీఈఎస్‌సిలో కూడా వేల్యూ అన్‌లాక్ అయ్యే
అవకాశం ఉందని కంపెనీ డీమెర్జ్ అయితే స్టాక్ ధర బాగా పెరుగుతుందని అంచనా వేసింది

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రౌండ్ ది క్లాక్ పద్దతిలో కరంట్ కొనుగోళ్లు చేస్తున్నాయ్. దీనివలనే ఓవరాల్ డిమాండ్ పెరగకపోయినా ఫీడర్ సెపరేషన్‌తో ఈ రంగంలో వ్యాపారం పెరుగుతుందని అంచనా. ఈ నాలుగు రాష్ట్రాల్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు దీర్ఘకాలిక ప్రాతిపదికన ఉన్నాయి. కాబట్టి పవర్ డిమాండ్ రానున్నరోజుల్లో ఖచ్చితంగా పెరిగే అవకాశాలే ఉన్నాయ్. ఈ కారణాలతో మోతీలాల్ ఓస్వాల్ కొన్ని స్టాక్స్‌ రానున్న రోజుల్లో లాభపడతాయని అంచనా వేసింది. మోతీలాల్ ఓస్వాల్ రికమండేషన్ ప్రకారం,

పవర్ గ్రిడ్-సిఎంపి రూ. 207.40| టార్గెట్ రూ.261
పవర్ గ్రిడ్‌ని ఇటీవలి కాలంలో పాజిటివ్‌ ఔట్‌లుక్‌తో బయ్ చేయమని చెప్తోన్న పవర్‌గ్రిడ్ ఇప్పుడు తాజా పరిణామాలతో 30శాతం అప్‌సైడ్ టార్గెట్ ఫిక్స్ చేసింది.

ఎన్‌టిపిసి-సిఎంపి రూ. 181.70  | టార్గెట్ రూ.211  |
ఇక ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసికి 17శాతం అప్‌సైడ్ టార్గెట్ ఫిక్స్ చేసింది. 
 
సిఈఎస్‌సి-సిఎంపి  రూ. 1033.70  | టార్గెట్ రూ.1360 | 
మోతీలాల్ ఓస్వాల్  సిఈఎస్‌సి సంస్థకి బయ్ రేటింగ్‌తో పాటు రూ.1360 ధరకి పెరిగే అవకాశాలున్నాయని చెప్తోంది.  

కోల్ఇండియా-సిఎంపి రూ. 272.30| టార్గెట్ రూ. 335 |
ప్రభుత్వరంగ సంస్థ కోల్ఇండియాకి ఉన్న వనరుల దృష్ట్యా తాజా పరిణామాల నేపధ్యంలో షేరులో ర్యాలీ నెలకొంటుందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. 20శాతం అప్‌సైడ్‌తో రూ.335వరకూ షేరు వెళ్లొచ్చని సూచిస్తోంది

ఇక సెల్ రికమండేషన్ విషయంలో  జెఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టాటా పవర్ స్టాక్స్‌ని ప్రస్తుత ధర వద్ద అమ్మమని సూచిస్తోంది. జెఎస్‌డబ్ల్యూఎనర్జీకి టార్గెట్ రూ.49, టాటా పవర్‌కి రూ.72 టార్గెట్‌గా షార్ట్ కొట్టమని రికమండ్ చేసింది.


( పైన చెప్పిన స్టాక్స్ అన్నీ మోతీలాల్ ఓస్వాల్‌ రికమండేషన్లు మాత్రమే..ప్రాఫిట్ యువర్ ట్రేడ్.ఇన్‌కి ఈ బయ్, సెల్ కాల్స్‌కి సంబంధం లేదు)Most Popular