లాభాలు స్వల్పమే -రియల్టీ హవా!

లాభాలు స్వల్పమే -రియల్టీ హవా!

మూడీస్‌ ఇన్వెస్టర్‌ సావరిన్‌ రేటింగ్‌ను పెంచడంతో గత వారం జోరందుకున్న మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటపట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య రోజంతా పరిమిత స్థాయిలోనే కదిలాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. గత వారాంతాన రేటింగ్‌ పెంపుతో హైజంప్‌చేసిన మార్కెట్లలో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించారు. వెరసి సెన్సెక్స్‌ 17 పాయింట్ల లాభంతో 33,360 వద్ద నిలవగా.. 15 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 10,299 వద్ద ముగిసింది.
కార్పెట్‌ ఏరియా ఎఫెక్ట్‌
ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా గృహ నిర్మాణంలో కార్పెట్‌ ఏరియాను పెంచడంతో  వరుసగా రెండో రోజు రియల్టీ కౌంటర్లు జోరందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగం అత్యధికంగా 2.2 శాతం ఎగసింది. మెటల్‌ 1.3 శాతం పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.9 శాతం నీరసించింది.
బ్లూచిప్స్‌లో
నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, యస్‌బ్యాంక్‌, బాష్‌, వేదాంతా, కోల్‌ ఇండియా, కోటక్‌ బ్యాంక్‌, హిందాల్కో, ఐబీ హౌసింగ్, ఓఎన్‌జీసీ 4-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే అంబుజా, డాక్టర్‌ రెడ్డీస్‌, అల్ట్రాటెక్‌, ఐసీఐసీఐ, స్టేట్‌బ్యాంక్‌, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌ 3.5-1 శాతం మధ్య క్షీణించాయి. 
చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు కన్సాలిడేట్‌ అయినప్పటికీ చిన్న షేర్లు పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 0.6 శాతంపైగా ఎగశాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,632 లాభపడితే.. 1036 మాత్రమే నష్టపోయాయి.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
దేశ సావరిన్‌ రేటింగ్‌ను మూడీస్‌ అప్‌గ్రేడ్‌ చేయడంతో శుక్రవారం(17న) నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,277 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. ఇక దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 1,467 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం విశేషం.Most Popular