బల్క్‌ డీల్‌తో నవకార్‌ కార్ప్‌ హైజంప్‌

బల్క్‌ డీల్‌తో నవకార్‌ కార్ప్‌ హైజంప్‌

బీఎస్‌ఈలో బల్క్‌ డీల్‌ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలువడటంతో నవకార్‌ కార్ప్‌ కౌంటర్‌ ఊపందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 195 వరకూ ఎగసింది.
రూ. 190 ధరలో
బల్క్‌ డీల్‌ ద్వారా  కంటెయినర్‌ ఫ్రైట్‌ స్టేషన్ల నిర్వాహక సంస్థ నవకార్‌ కార్ప్‌నకు చెందిన 5.01 లక్షల షేర్లు ట్రేడైనట్లు ఎక్స్ఛేంజీ డేటా వెల్లడించింది. షేరుకి రూ. 190 ధరలో డీల్‌ జరిగినట్లు తెలుస్తోంది. Most Popular