కొనుగోళ్లతో కెమ్‌బాండ్‌ కెమ్‌ జోరు

కొనుగోళ్లతో కెమ్‌బాండ్‌ కెమ్‌ జోరు

ఫిరోజ్‌ సేత్నాలో పూర్తి వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని(ఎస్‌పీఏ) కుదుర్చుకున్నట్లు స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ కెమ్‌బాండ్‌ కెమికల్స్‌ పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 237 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 239 వరకూ ఎగసింది.
ఎస్‌పీఏలో భాగంగా ఫిరోజ్‌ సేత్నాతోపాటు.. ఈ సంస్థకు సొంత అనుబంధ కంపెనీ అయిన  గ్రామోస్‌ కెమికల్స్‌ ఇండియాను సైతం కొనుగోలు చేయనున్నట్లు కెమ్‌బాండ్‌ తెలియజేసింది. తదుపరి ఈ రెండు సంస్థలూ కెమ్‌బాండ్‌కు పూర్తి అనుబంధ కంపెనీలుగా వ్యవహరించనున్నాయి.Most Popular