పీఎన్‌బీ అండతో ఏస్‌ లాభాల టార్గెట్‌!

పీఎన్‌బీ అండతో ఏస్‌ లాభాల టార్గెట్‌!

దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాల విక్రయానికి ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో యాక్షన్‌ కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌(ఏస్‌) కౌంటర్‌ ఊపందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 16 శాతం దూసుకెళ్లి రూ. 129 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 131 వరకూ ఎగసింది.
9.2 శాతం వడ్డీ
దేశవ్యాప్తంగా రైతులు వ్యవసాయ పరికరాల కొనుగోలు చేసేందుకు 9.2 శాతం వడ్డీపై పీఎన్‌బీ రుణాలు విడుదల చేయనున్నట్లు ఏస్‌ పేర్కొంది. దీంతో పీఎన్‌బీ బ్రాంచీల ద్వారా తమ ఉత్పత్తులను మరింత అధికంగా విక్రయించగలుగుతామని తెలియజేసింది.Most Popular