క్యూ2తో రెండో రోజూ గతి దూకుడు!

క్యూ2తో రెండో రోజూ గతి దూకుడు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో లాజిస్టిక్స్‌ కంపెనీ గతి కౌంటర్‌ వరుసగా రెండో రోజు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 142 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 145 వరకూ ఎగసింది. కాగా... పటిష్ట ఫలితాల కారణంగా శుక్రవారం సైతం ఈ షేరు దాదాపు 9 శాతం దూసుకెళ్లి రూ. 132 వద్ద ముగిసింది.
లాభం హైజంప్‌
క్యూ2(జూలై-సెప్టెంబర్‌)లో గతి లిమిటెడ్‌ నికర లాభం 179 శాతంపైగా దూసుకెళ్లి రూ. 21 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా 2 శాతం పెరిగి రూ. 434 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి.Most Popular