మార్కెట్లు అక్కడక్కడే- చిన్న షేర్లు ముద్దు!

మార్కెట్లు అక్కడక్కడే- చిన్న షేర్లు ముద్దు!

మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ దేశ సావరిన్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో వారాంతాన జోరందుకున్న మార్కెట్లు ప్రస్తుతం కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 8 పాయింట్లు బలపడి 33,351కు చేరగా... నిఫ్టీ దాదాపు యథాతథంగా 10,283 వద్ద ట్రేడవుతోంది.
లాభపడ్డవే అధికం 
ప్రస్తుతం బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.35 శాతం బలపడగా.. స్మాల్‌ క్యాప్‌ మరింత అధికంగా 0.7 శాతం ఎగసింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,551 లాభపడితే.. 909 మాత్రమే నష్టాలతో కదలుతున్నాయి.
జోరుగా..
స్మాల్‌ క్యాప్స్‌లో స్టెర్లింగ్‌ టూల్స్, ఎక్సెల్‌ ఇండస్ట్రీస్‌, జైకార్ప్‌, ఎస్‌ఎంఎస్‌ ఫార్మా, పనామా పెట్రో, బాంబే రేయాన్‌, ఎఫ్‌ఎం గోయట్జ్‌, గతి, ఇండోరమా, ఈపీసీ ఇండస్ట్రీస్‌, ప్రోజోన్‌ తదితరాలు 19-7 శాతం మధ్య దూసుకెళ్లాయి.Most Popular