ఆసియా మార్కెట్లు అటూఇటూ!

ఆసియా మార్కెట్లు అటూఇటూ!

ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన పన్ను సంస్కరణలకు సెనేట్‌ ఆమోదం లభించడంపై సందేహాలతో శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోగా... ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ప్రచారానికి సంబంధించి రష్యా పాత్రపై సందేహాలు బలపడుతున్న నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 93.93కు నీరసించింది. జపనీస్‌ యెన్‌ 112.12కు చేరింది. మరోపక్క రెండేళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ తొమ్మిదేళ్ళ గరిష్టానికి బలపడ్డాయి. 1.72 శాతాన్ని తాకాయి. పదేళ్ల బాండ్ల ఈల్డ్స్‌ 2.35 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి.
ఇదీ తీరు
ఆసియా మార్కెట్లలో ప్రస్తుతం చైనా, జపాన్‌, తైవాన్‌ 0.9-0.3 శాతం మధ్య బలహీనపడగా.. హాంకాంగ్‌ 0.1 శాతం నీరసించింది. మరోవైపు ఇండొనేసియా 0.6 శాతం, థాయ్‌లాండ్‌ 0.5 శాతం చొప్పున పుంజుకోగా.. సింగపూర్‌, కొరియా 0.1 శాతం చొప్పున బలపడ్డాయి. Most Popular