నష్టాలలోకి- పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌ వీక్‌!

నష్టాలలోకి- పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌ వీక్‌!

ప్రారంభ హెచ్చుతగ్గుల నుంచి పుంజుకున్న మార్కెట్లు అమ్మకాలు పెరగడంతో వెనకడుగు వేశాయి. ప్రస్తుతం నష్టాలలోకి ప్రవేశించాయి. సెన్సెక్స్‌ 32  పాయింట్లు క్షీణించి 33,310కు చేరగా.. నిఫ్టీ 17 పాయింట్లు నీరసించి 10,266ను తాకింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్‌ కౌంటర్లలో ప్రధానంగా అమ్మకాలు పెరగడం మార్కెట్లను బలహీనపరచింది. ఈ రెండు రంగాలూ ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం స్థాయిలో క్షీణించాయి.
బ్లూచిప్స్‌ ఇలా
నిఫ్టీ దిగ్గజాలలో అంబుజా, హిందాల్కో, సిప్లా, ఐసీఐసీఐ, స్టేట్‌బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, జీ, టెక్‌ మహీంద్రా 2.2-1.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి. మరోపక్క ఇన్‌ఫ్రాటెల్‌, యస్‌బ్యాంక్‌, గెయిల్‌, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌, మారుతీ, ఎల్‌అండ్‌టీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, ఐటీసీ 3-0.6 శాతం మధ్య ఎగశాయి.Most Popular