సెంచరీకి చేరువ- ఎఫ్‌ఎంసీజీ, ఆటో అప్‌!

సెంచరీకి చేరువ- ఎఫ్‌ఎంసీజీ, ఆటో అప్‌!

వారాంతాన మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ దేశ సావరిన్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో జోరందుకున్న మార్కెట్లు మరోసారి లాభాలతో కదులుతున్నాయి. సెన్సెక్స్‌ సెంచరీకాగా..  మార్కెట్లు తొలుత స్వల్ప స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 94 పాయింట్లు పుంజుకుని 33,437కు చేరింది. నిఫ్టీ సైతం 20 పాయింట్లు బలపడి 10,304 వద్ద ట్రేడవుతోంది.
రియల్టీ సైతం
ఎన్‌ఎస్‌ఈలో ఆటో, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఫార్మా రంగాలు 0.6-0.3 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, యస్‌బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, గెయిల్‌, ఎన్‌టీపీసీ, ఐబీ హౌసింగ్‌, ఓఎన్‌జీసీ, మారుతీ, బజాజ్‌ ఆటో, ఐటీసీ 2-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే మరోవైపు అంబుజా, అల్ట్రాటెక్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, సిప్లా, జీ, బీపీసీఎల్‌, ఇన్ఫోసిస్‌, ఐవోసీ, టాటా స్టీల్‌ 2-0.5 శాతం మధ్య నీరసించాయి.Most Popular