యూఎస్‌కు సంస్కరణల సందేహాలు!

యూఎస్‌కు సంస్కరణల సందేహాలు!

ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన పన్ను సంస్కరణలకు సెనేట్‌ ఆమోదం లభించడంపై సందేహాలతో శుక్రవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి డోజోన్స్‌ 90 పాయింట్లు(0.4 శాతం) క్షీణించి 23,368 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 5 పాయింట్లు(0.2 శాతం) తగ్గి 2,581 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ 7 పాయింట్ల వెనకడుగుతో 6,786 వద్ద ముగిసింది. 
డాలరు వీక్
ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో రష్యా పాత్రపై సందేహాలు బలపడుతున్న నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు నీరసించింది. మరోపక్క రెండేళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ తొమ్మిదేళ్ళ గరిష్టానికి బలపడ్డాయి. 1.72 శాతాన్ని తాకాయి. పదేళ్ల బాండ్ల ఈల్డ్స్‌ 2.35 శాతానికి చేరాయి. Most Popular