తక్కువ రేటు ఎక్కువ లాభం ఛాన్సున్న 5 స్టాక్స్

తక్కువ రేటు ఎక్కువ లాభం ఛాన్సున్న 5 స్టాక్స్

మార్కెట్లు మళ్లీ గరిష్టస్థాయిలవైపు వేగంగా దూసుకెళ్తున్నాయ్. చాలా కంపెనీల షేర్లు లైఫ్ టైమ్ హై మార్క్ కూడా టచ్ చేసి ఉన్నాయ్..మరి ఇలాంటి దశలో లాభాలు తెచ్చిపెట్టే స్టాక్స్ కనుక్కోవడం కొద్దిగా కష్టమైన పనే..ఐతే అలాంటి ఓ  ఐదు కంపెనీలను ప్రాఫిట్‌యువర్ ట్రేడ్.ఇన్ అందిస్తోంది. తక్కువ ధరలో ఉండాలి..ఎక్కువ లాభాలు కావాలి..ఇన్వెస్టర్లలో ఎక్కువమందికి ఇలాంటి స్టాక్స్ ఉంటే బావుండనే  ఆలోచన కలగడం సహజం. అలాంటి వాటిలో కొన్ని స్టాక్స్ చూస్తే..
ఆల్ఫాజియో : CMP 891.85
ఆల్ఫాజియో మంచి కంపెనీగా చెప్పుకోవచ్చు. దేశంలో  ఆయిల్ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశలో కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఈ కంపెనీకి బాగా లాభించనుందని టాక్. జియోలాజికల్ సర్వేలు..భూకంపాల సమాచారంపై సేవలు అందించే ఆల్ఫాజియో త్వరలోనే కేంద్రంనుంచి పెద్ద ఒప్పందాలు రావచ్చని ప్రచారం జరుగుతోంది.ఆయిల్ఇండియా, ఓఎన్జీసీ 24 రాష్ట్రాల్లో చమురు అన్వేషణ కోసం రూ.3వేలకోట్లు ఖర్చు పెట్టనున్నాయ్. ఇందులో వాటా అంటూ దక్కితే ఆల్ఫాజియోకే దక్కుతుందని అంటున్నారు. రూ.900పైనే ట్రేడవుతోన్న ఈ షేరు ధర ఇంకా పెరుగుతుందని అంచనా..

శ్రీకాళహస్తి పైప్స్ : CMP 891.85
 నీటి సరఫరా కోసం వాడే ఇనుప పైపులను తయారు చేసే శ్రీకాళహస్తి పైప్స్ కూడా ఇన్ఫ్రా బూమ్‌తో బాగా లాభపడనుంది. అటు మురుగునీటి పారుదల, ఇటు జల రవాణా కోసం ఉపయోగపడే శ్రీకాళహస్తి పైప్స్ తన ఉత్పత్తుల్లో 90శాతం అమ్మకాలు సాధిస్తోంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో 3లక్షల టన్నుల పైపులు విక్రయించింది. ఇది గత ఏడాదితో పోల్చితే 30శాతం అదికం. నడుస్తోన్న థర్డ్ క్వార్టర్‌లో ఈ లాభాలు ప్రతిఫలిస్తాయని అంచనా. కంపెనీ ప్రస్తుతం తన తన పైపుల తయారీలో పల్వరైజ్డ్ కోల్ ఇంజెక్షన్ అనే టెక్నాలజీ కూడా కొత్తగా  అమలు పరుస్తోంది. దీంతో కోల్ కేక్ స్థానంలో బొగ్గు వాడే అవకాశం కలుగుతోంది..తద్వారా తయారీఖర్చు తగ్గడం..లాభం పెరగడానికి దోహదపడుతోంది. కోక్ టన్నుకు 270 డాలర్లుండగా..బొగ్గు 120 డాలర్లు మాత్రమే. అందుకే రానున్న రోజుల్లో ఈ షేరు ధర పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయ్

ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్: CMP 299.80
 ఇక పేపర్ ఇండస్ట్రీకి చెందిన ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్ ట్రైలింగ్ పీఈ 5.6శాతంగా ఉంది..క్యు2లో 31.40శాతం నికరలాభంలో వృధ్ది నమోదు చేసింది. వేస్ట్ పేపర్ నుంచి ప్యాకేజింగ్ బోర్డు, రైటింగ్ ప్రింటింగ్ బోర్డుల తయారీ 8శాతం పెరగడం గమనార్హం. క్యు2 సాధారణంగా పేపర్ తయారీ కంపెనీలకు మంచి ప్రాఫిట్స్ అందిస్తుంది. అదే కోవలో ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్ గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్లో మంచి ప్రైస్ హైక్స్ రిజిస్టర్ చేసింది. అంతర్జాతీయంగా పేపరు ధరలు పెరగడంతో కొద్ది రోజుల్లోనే ఎన్ఆర్ అగర్వాల్ కూడా వాటి ధర పెంచనుంది. ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతుండటం కంపెనీకి ప్లస్ పాయింట్. ప్రస్తుతం రూ.290 వద్ద కదలాడుతున్న ఈ షేరు ధర త్వరలోనే రూ.350 తాకవచ్చని అంచనా

ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్: CMP 40.15
 బిపిఓ బేస్డ్ కంపెనీ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కొన్నేళ్లుగా తక్కువ మార్జిన్ల వ్యాపారాన్ని వదిలించుకునే పనిలోఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో తన వ్యాపారం విస్తరిస్తోంది. అలా క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో ఈ వ్యాపారం మార్జిన్లు 27.1శాతం నుంచి 29.2శాతానికి పెంచుకుంది కూడా క్యు2లో 13శాతం ఆపరేటింగ్ ప్రాఫిట్ నమోదు చేసింది. ఎర్నింగ్స్ పరంగా 9రెట్లు ట్రయలింగ్‌తో ట్రేడవుతోంది fsl. రూ.40లోపే ట్రేడవుతోన్న ఈ స్టాక్ నియర్ టర్మ్‌లో 50వరకూ వెళ్లే అవకాశం కన్పిస్తోంది

ధంపూర్ షుగర్స్: CMP 274.35
 షుగర్ స్టాక్స్‌లో పేరెన్నికగన్న..ధంపూర్ షుగర్స్ ఎర్నింగ్స్ పరంగా షేరుకు 60 రూపాయలు నమోదు చేసింది. ప్రస్తుతం ట్రేడవుతోన్న రేటైన రూ.272 అనేది కనీసం దాని అసలు ట్రేడవ్వాల్సిన రేటు కంటే 5రెట్లు తక్కువని అనలిస్టుల అంచనా..ఇథనాల్ రేట్లు 5శాతం కేంద్రం ఇటీవలే పెంచింది. ధంపూర్ షుగర్స్ ఫ్యాక్టరీలో రోజుకు 3.3లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. ఇథనాల్ ప్రొడక్షన్‌లోనూ రెండో పెద్ద కంపెనీ కావడంతో రానున్నరోజుల్లో మరింత లాభం చేకూరుతుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న 275రూపాయల రేటు నుంచి పదిశాతం అప్‌సైడ్ జంప్ కన్పించవచ్చని అంచనా

( పైన చెప్పిన స్టాక్స్ కొనమని ప్రాఫిట్ యువర్ ట్రేడ్. ఇన్ సైట్ రికమండ్ చేయడం లేదు..వాటి స్థితిగతులను అంచనా వేసి భవిష్యత్తులో రేటు పెరగవచ్చనే అంచనాతో రాసిన కథనం మాత్రమే ఇది)Most Popular