అడాగ్‌ షేర్లకు ఆర్‌కామ్‌ షాక్‌!

అడాగ్‌ షేర్లకు ఆర్‌కామ్‌ షాక్‌!

డాలర్‌ డినామినేషన్‌లో జారీ చేసిన 2020 బాండ్ల చెల్లింపుల్లో విఫలంకావడంతో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతేకాకుండా సెంటిమెంటు దెబ్బతినడంతో మొత్తం అనిల్‌ అంబానీ గ్రూప్‌ షేర్లన్నిటిలోనూ అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం ఆర్‌కామ్‌ షేరు 11 శాతం పతనమై రూ. 10.30ను తాకింది. 
అన్ని షేర్లూ పతనం
ఆర్‌కామ్‌ బాటలో రిలయన్స్‌ కేపిటల్‌ 8.3 శాతం కుప్పకూలి రూ. 432కు చేరగా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 8 శాతం దిగజారి రూ. 423 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా రిలయన్స్‌ పవర్‌ 5.5 శాతం పతనమై రూ. 36.5ను తాకగా.. రిలయన్స్‌ నావల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ 5.4 శాతం తిరోగమించి రూ. 45 వద్ద కదులుతోంది. రిలయన్స్ నిప్పన్‌ ఏఎంసీ 6.5 శాతం జారి రూ. 256కు చేరగా, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ 9 శాతం పడిపోయి రూ. 65 వద్ద ట్రేడవుతోంది.Most Popular