ఖాదిమ్‌ ఇండియా లిస్టింగ్‌ నేడు!

ఖాదిమ్‌ ఇండియా లిస్టింగ్‌ నేడు!

ఈ నెల తొలి వారంలో పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న దేశీ ఫుట్‌వేర్‌ సంస్థ ఖాదిమ్‌ ఇండియా నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఇష్యూ ధర రూ. 750కాగా.. తద్వారా కంపెనీ రూ. 543 కోట్లను సమీకరించింది. అయితే ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి అంతంత మాత్రంగానే స్పందన లభించింది. ఇష్యూకి 1.9 రెట్లు అధికంగా మాత్రమే బిడ్స్‌ దాఖలయ్యాయి. 
యాంకర్‌ నిధులు
ఇష్యూలో భాగంగా ఖాదిమ్‌ ఇండియా ప్రమోటర్‌ సిద్దార్థ రాయ్‌ బర్మన్‌ 7.22 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించగా.. ఫెయిర్‌విండ్స్‌ ట్రస్టీస్‌ 58.52 లక్షలకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచింది. ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 157.5 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 750 ధరలో 13 యాంకర్‌ సంస్థలకు షేర్లను కేటాయించింది. 
రుణాల చెల్లింపులకు
పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ఖాదిమ్‌ ఇండియా ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.  1981లో ఏర్పాటైన కంపెనీ ఖాదిమ్‌ బ్రాండ్‌తో ప్రధానంగా ఫుట్‌వేర్‌ తయారీ, విక్రయాలను నిర్వహిస్తోంది. 2017 జూన్‌కల్లా దేశవ్యాప్తంగా 853 రిటైల్‌ స్టోర్లను ఏర్పాటు చేసింది. Most Popular