న్యూ ఇండియా నష్టాల ఎస్యూరెన్స్‌?!

న్యూ ఇండియా నష్టాల ఎస్యూరెన్స్‌?!

కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌.. నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఇష్యూ ధర రూ. 800కాగా.. ప్రస్తుతం ప్రీఓపెనింగ్‌లో రూ. 50 నష్టంతో రూ. 750 వద్ద స్థిరపడింది. దీంతో నష్టాలతో లిస్టయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగానికే చెందిన బీమా దిగ్గజం ఎల్‌ఐసీ అండగా నిలవడంతో న్యూ ఇండియా  పబ్లిక్‌ ఇష్యూ గట్టెక్కింది. రూ. 9,600 కోట్ల ఇష్యూ చివరి రోజు(3)కల్లా 1.2 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. షేరుకి రూ. 770-800 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 12 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 14.32 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) విభాగం నుంచి 2.3 రెట్లు అధికంగా బిడ్స్‌ లభించాయి. దీనిలో ఎల్‌ఐసీ ఒక్కటే సుమారు రూ. 6500 కోట్ల విలువైన బిడ్స్‌ దాఖలు చేసిన విషయం విదితమే. Most Popular