ఈ స్టాక్స్‌నే ఎందుకు గమనించాలి..? (నవంబర్‌ 13)

ఈ స్టాక్స్‌నే ఎందుకు గమనించాలి..? (నవంబర్‌ 13)

సోమవారం(ఈనెల 13న) Cochin Shipyard, IPCA Laboratories, Union Bank of India, Apollo Hospitals and Mcleod Russel Indiaల్లో సిగ్నిఫికెంట్‌ మూమెంట్‌ వచ్చే ఛాన్స్‌ కనిపిస్తోంది. 

Cochin Shipyard: శుక్రవారం మార్కెట్లు ముగిశాక ఈ కంపెనీ Q2 ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నికరలాభంలో 10.63 శాతం వృద్ధి నమోదైంది. 

IPCA Laboratories: వచ్చే మూడేళ్ళ కాలానికి యాంటి మాలేరియా మెడిసిన్స్‌ సరఫరా కోసం ఇప్కా ల్యాబ్స్‌ను ఎంపిక చేసినట్టు "ది గ్లోబల్‌ ఫండ్‌" ప్రకటించింది.

Union Bank of India: రూ.2,300 కోట్ల నిధులను అదనపు టైర్‌-1 క్యాపిటల్‌గా సేకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

Apollo Hospitals: సోమవారం(ఈనెల 13న) ఈ కంపెనీ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనుంది. ఫలితాలకు అనుగుణంగా స్టాక్స్‌లో కదలికలుంటాయి. 

Mcleod Russel India: ప్యాకెట్‌ టీ బిజినెస్‌ను డెవలప్‌ చేయడానికి ఎవరెడి ఇండస్ట్రీస్‌ ఇండియాతో జేవీ కుదుర్చుకునే యోచనలో ఉన్నట్టు మెక్‌లాయిడ్‌ రసెల్‌ ప్రకటించింది. Most Popular