ఇంట్రాడే వ్యూ.. ఈ సమయంలో ఎలాంటి వ్యూహం పాటించాలి..? (నవంబర్‌ 8)

ఇంట్రాడే వ్యూ.. ఈ సమయంలో ఎలాంటి వ్యూహం పాటించాలి..? (నవంబర్‌ 8)

మనం ముందుగా అంచనా వేసినట్లు హైయర్‌ లెవల్స్‌ 10485 వద్ద నిఫ్టీ రివర్స్ అయింది. ఈ సమయంలో కీలక స్థాయి 10400గా చెప్పొచ్చు. నిన్న ఇంట్రాడేలో మార్కెట్లు 10341 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 10390 దిగువన క్లోజ్‌ కావడం షార్ట్‌టర్మ్‌లో మార్కెట్లు డౌన్‌ట్రెండ్‌లో పయనించడానికి సంకేతాలుగా భావించాలి. బ్యాంక్‌ నిఫ్టీ కూడా షార్ట్‌టర్మ్‌లో రివర్స్‌ ట్రెండ్‌ కనిపిస్తోంది. ఇవాళ ఆటో, ఫార్మా, మెటల్స్‌, రియాల్టీ, మిడ్‌క్యాప్‌-50 సూచీలు బలహీనంగా ట్రేడ్‌ కావచ్చు. నిఫ్టీకి డౌన్‌సైడ్‌లో 10240-10207 వద్ద సపోర్ట్ లభించే అవకాశాలున్నాయి. ఈ డౌన్‌ట్రెండ్‌లో మెజార్టీ రంగాల షేర్లు వీక్‌గా ఉండే అవకాశముంది. ప్రతి పెరుగుదలలోనూ అమ్మకాల వ్యూహాన్ని అమలు చేయండి. లాంగ్‌పొజిషన్లకు ఇన్వెస్టర్లు స్టాప్‌లాస్‌ను తప్పనిసరిగా పాటించాలి. ఈ సమయంలో లాభాల స్వీకరణకు దిగడం మంచింది. కొత్త పొజిషన్లకు దూరంగా ఉండండి. నిఫ్టీ రెసిస్టెన్స్‌ 10490. 

STOCK RECOMMENDATION:
FEDERALBNK FUTURES
SHORT SELL AT 114 
TARGET : 105 
STOP LOSS : 118
DURATION : 2 DAYS

- సూర్యదేవ్‌ బండారి, రీసెర్చ్‌ ఎనలిస్ట్‌Most Popular