బీమా కంపెనీలు బంగారు గనులేనా?

బీమా కంపెనీలు బంగారు గనులేనా?


దలాల్ స్ట్రీట్‌లో బీమా కంపెనీల హంగామా బాగానే పెరుగుతోంది. బుల్ మార్కెట్లో వీటి ప్రదర్శన కూడా బాగుండడంతో.. వాల్యుయేషన్స్ పరంగాను కంపెనీల విలువ ఊపందుకుంటోంది. దేశీయ బీమా వ్యాపారం భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని.. ప్రస్తుతం ఎమర్జింగ్ బిజినెస్ ఇదేనని విశ్లేషకులు చెబుతుంటారు. కానీ వరుసగా బీమా కంపెనీల లిస్టింగ్ కారణంగా వాల్యుయేషన్ విషయంలో రిస్క్ పెరుగుతోంది. 

లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పిన ప్రకారం అయితే.. "తగిన కంపెనీని అద్భుతమైన ధరలో కొనడం కంటే.. అద్భుతమైన కంపెనీని తగిన ధరలో కొనడం మంచిది".

అయితే.. ప్రస్తుతం ఎనలిస్ట్‌లు కొంత రిస్క్ తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలను వీళ్లు ఫ్యాన్సీగా భావిస్తున్నారు. నిజానికి ఈ కంపెనీలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వాల్యుయేషన్స్ చాలా ఖరీదుగా ఉన్నా.. అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉండడం గమనించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

 

అప్పట్లో కోల్గేట్, హెచ్‌యూఎల్

1980, 90లలో కోల్గేట్, హిందుస్తాన్ లీవర్ షేర్లను ఎలా జనాలు ఎంత ఉత్సాహంగా పరిశీలించారో ఎనలిస్ట్‌లు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఈ రెండు స్టాక్స్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా కనిపించాయి. ఎప్పుడూ ఇవి చవగ్గా కనిపించలేదు. అయినా ఈ స్టాక్స్ లాభాలు పంచాయని అంటున్నారు.

గత శుక్రవారం నాటి క్లోజింగ్ ప్రకారం హిందుస్తాన్ యూనిలీవర్ 74.31పీఈతోను.. కోల్గేట్ పామోలివ్ 12నెలల ఎర్నింగ్స్కు 48.16 పీఈతోను ట్రేడవుతున్నాయి. గత రెండు దశాబ్దాలలో ఈ స్టాక్స్ పలు రెట్లు పెరిగాయి. అలాగే జీవిత బీమా, జనరల్ ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అధిక పీఈలు కలిగి ఉన్నా.. రాబోయే కాలంలో కూడా మంచి రిజల్ట్స్ ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అయితే కొందరు మాత్రం వాల్యుయేషన్స్ అధికంగా ఉన్న ఈ కౌంటర్లలో కొంతకాలం పాటు దూరంగా ఉండడం కూడా సరైన వ్యూహమే అని మరికొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. దీర్ఘ కాలంలో చాలా మంచి ఫలితాలను ఈ బీమా కంపెనీలు ప్రకటించే అవకాశం ఉన్న విషయాన్ని మాత్రం దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. 

తమ మ్యూచువల్ ఫండ్‌లో కొన్ని జనరల్ ఇన్సూరెన్స్ స్టాక్స్ ఉన్న విషయాన్ని కొన్ని కంపెనీలు అంగీకరిస్తున్నాయి. అయితే జీవిత బీమా కంపెనీల ఎంపికలో మాత్రం వేచిచూసే ధోరణిని ఎక్కువ మంది అవలంబిస్తున్నారు.

 

లిస్టెడ్ కంపెనీల పరిస్థితి
గతేడాది సెప్టెంబర్‌లో లిస్టింగ్ నాటి ధరతో పోల్చితే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 16.11 రెట్లు పెరిగింది. తాజా లిస్టింగ్‌లలో ఎస్‌బీఐ లైఫ్ 8 శాతం డిస్కౌంట్ ధర వద్ద ట్రేడవుతుండగా.. జీఐసీ ఆర్ఈ 9 శాతం డిస్కౌంట్ వద్ద లభిస్తోంది. ఇదే సమయంలో ఐసీఐసీఐ లాంబార్డ్ 2 శాతం ప్రీమియం వద్ద ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇష్యూ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. వాల్యుయేషన్ పరంగా చూస్తే.. ఇన్సూరెన్స్ సెక్టార్‌ను భారత్ వరకు మాత్రమే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి క్రేజీ స్టాక్స్ కొనుగోలు చేసేందుకు ముందు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాల విషయానికి వస్తే భారత్ మాక్రోఎకనామిక్ స్టోరీని పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. తాజా లిస్టింగ్‌లలో 2-3 స్టాక్స్ సమానమైన ప్రగతి సాధిస్తుండగా.. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల కంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.Most Popular