రోజుకి కేవలం రూ.1 కే అన్ లిమిటెడ్ మూవీ డౌన్‌లోడ్స్

రోజుకి కేవలం రూ.1 కే అన్ లిమిటెడ్ మూవీ డౌన్‌లోడ్స్

మీ ఫేవరెట్ స్టార్ మూవీని కేవలం ఒక్క రూపాయితో డౌన్ లోడ్ చేసుకోవచ్చంటోంది ఫాస్ట్ ఫిలిమ్జ్. మీకు జస్ట్‌ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు fastfilmz యాప్ ను డౌన్‌లోడ్ చేసుకొని ఎంచక్కా మీకిష్టమైన మూవీస్ హెచ్‌డీ క్లారిటీతో చూసెయ్యొచ్చు. వి-నోవా అనే కంప్రెషన్ టెక్నాలజీతో ఈ యాప్‌ను రూపొందించారు. ఇతర యాప్‌లలో మాదిరిగా 600 ఎంబీ డేటా డౌన్‌లోడ్ చేసుకోకుండా ప్రతి సినిమాకి కేవలం 150 ఎంబీ డేటాతో సినిమా డౌన్‌లోడ్ చేసుకోవడమే ఈ యాప్ ప్రత్యేకత. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారికి ట్రయల్ వెర్షన్ రెండు వారాల పాటు ఉచితంగా లభిస్తోందని కంపెనీ కో ఫౌండర్ కరమ్ మల్హోత్రా తెలిపారు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారు సబ్ స్క్రిప్షన్ రుసుం కింద వారానికి 10 రూపాయలు.. నెలకు 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అంటే రోజుకి కేవలం ఒక్క రూపాయికే మీకు నచ్చిన మూవీస్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ డెబిట్ / క్రెడిట్ కార్డు లేదా మొబైల్ వ్యాలెట్ నుంచి కాకుండా..నేరుగా మొబైల్ టాక్ టైం నుంచి తగ్గించుకొనే విధంగా వినియోగదారునికి చెల్లింపు విధానాన్నిసులభతరం చేసిందీ కంపెనీ. ప్రస్తుతానికి 70 కొత్త తెలుగు సినిమాలు పొందుపరిచామని, తమిళ్‌లో మరో వంద సినిమాలు అందుబాటులో ఉన్నాయని.. త్వరలో మరిన్ని హిట్ మూవీస్ చేర్చనున్నామని ఫాస్ట్ ఫిలిమ్జ్ తెలిపింది.Most Popular