స్వల్ప కాలానికి 3 హాట్ స్టాక్స్!

స్వల్ప కాలానికి 3 హాట్ స్టాక్స్!


హెచ్‌సీఎల్ టెక్నాలజీస్| ప్రస్తుత ధర: రూ. 844| BUY| టార్గెట్ : రూ. 945| స్టాప్‌లాస్ : రూ. 825
డైలీ ఛార్టులలో హైయర్ టాప్ హైయర్ బాటమ్ ఫార్మేషన్‌ను చూపిస్తూ.. 52 వారాల గరిష్ట స్థాయికి ఈ స్టాక్ చేరుకుంది. కొన్ని రోజుల క్రితం తాజా గరిష్టాలను అందుకున్న ఈ స్టాక్.. ఆ తర్వాత గణనీయంగా తగ్గుతూ వచ్చింది. అయితే ఇది నారో రేంజ్ కన్సాలిడేషన్ మాత్రమేనని ఛార్టిస్టులు అంటున్నారు. ఓవర్‌సోల్డ్ జోన్‌ నుంచి ఆర్ఎస్ఐ రివర్సల్ తీసుకోవడం చూస్తే.. ఈ స్టాక్‌లో టర్న్అరౌంట్ వచ్చే అవకాశాలు కనిపస్తున్నాయి.

 

హావెల్స్ ఇండియా|ప్రస్తుత ధర: రూ. 494| BUY| టార్గెట్: రూ. 535-565| స్టాప్‌లాస్: రూ. 479
లైఫ్‌టైం హై లెవెల్ రూ. 564.60ను తాకిన తర్వాత ఈ స్టాక్ గణనీయంగా దిగి వచ్చింది. తాజాగా ప్రకటించిన క్యూ2 రిజల్ట్స్ ఆకట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం. లాంగ్ టెర్మ్ మూవింగ్ యావరేజ్ 100డే ఎస్ఎంఏ వద్ద ఈ స్టాక్ సపోర్ట్ తీసుకుని.. హెల్దీ రివర్సల్ స్థితిలోకి చేరుకుంది. రూ. 480 దిగువన రివర్సల్ తీసుకోవడంతో పాటు బుల్ మార్కెట్ సపోర్ట్ జోన్‌కూడా మద్దతు పలికింది.

 

వోక్‌హార్డ్|ప్రస్తుత ధర: రూ. 698| BUY| టార్గెట్: రూ. 780| స్టాప్‌లాస్: రూ. 610
52 వారాల కనిష్ట స్థాయి రూ. 531ని తాకిన తర్వాత ఈ స్టాక్ ఐదున్నర నెలల గరిష్ట స్థాయిని అందుకుని.. లాంగ్‌టెర్మ్ మూవింగ్ యావరేజ్ 200డే ఎస్ఎంఏ వద్ద సెటిల్ కావడం.. పాజిటివ్ సిగ్నల్‌గా చెప్పవచ్చు. ఆర్ఎస్ఐ, ఎంఏసీడీ వంటి టెక్నికల్ ఇండికేటర్స్‌ను గమనించినా.. గత నెగిటివ్ మూమెంటం నుంచి బయటకు వచ్చిందనే సిగ్నల్స్‌ను ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మరింతగా ఈ స్టాక్‌ వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.Most Popular