ఇన్‌ఫ్రా కంపెనీలకు బ్యాడ్‌ న్యూస్‌..

ఇన్‌ఫ్రా కంపెనీలకు బ్యాడ్‌ న్యూస్‌..

20 జాతీయ రహదారి అభివృద్ధి కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్టు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది. వచ్చే 2-3 ఏళ్ళలో నిర్వహించే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య(పిపిపి) ప్రాజెక్టులతో పాటు ఇంజనీరింగ్  ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌(EPC)ప్రాజెక్టుల బిడ్డింగ్‌ నుంచి కొన్ని మౌలిక సదుపాయాల కంపెనీలను నిషేధిస్తున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఈ జాబితాలో ఎల్‌అండ్‌టీ, హిందుస్తాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (హెచ్‌సీసీ), ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా, ఎంబీఎల్‌ ఇన్‌ఫ్రా, జేకేఎం ఇన్‌ఫ్రా, మధుకాన్‌ టోల్‌ హైవేస్‌, సుప్రీం ఇన్‌ఫ్రా, ట్రాన్స్‌రాయ్‌ ఇండియాతో పాటు మరిన్ని కంపెనీలు ఉన్నాయి. అయితే నవంబర్‌ 6లోపు తమ ముందు ఆయా కంపెనీలు వాదనను వినిపించుకునే సమయమిచ్చింది NHAI. 

ప్రమాణాలకు అనుగుణంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దడంలో ఈ కంపెనీలు ఫెయిల్‌ అయ్యాయని, 2015-17 మధ్యకాలంలో వారికి కేటాయించిన ప్రాజెక్టుల కాంట్రాక్టులను పూర్తి చేయలేకపోయాయని రెగ్యులేటర్‌ వెల్లడించింది. అందుకే ఈ కంపెనీలు PPP, EPC, టోల్, రోడ్ల మంత్రిత్వ శాఖలు నిర్వహించే బిడ్డింగ్‌లో పాల్గొనడంపై నిషేధం విధించినట్టు ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ దీపక్‌ కుమార్‌ తెలిపారు. నవంబర్‌6లోపు ఆయా కంపెనీల వాదనలు వింటామని.., ఆ కంపెనీల తప్పులేదని తేలితే నిషేధంపై పునరాలోచిస్తామని ఆయన వెల్లడించారు. Most Popular