ఈ స్టాక్స్‌లో యాక్టివిటీకి చాన్స్‌!..? (నవంబర్‌ 6)

ఈ స్టాక్స్‌లో యాక్టివిటీకి చాన్స్‌!..? (నవంబర్‌ 6)

సోమవారం ట్రేడింగ్‌లో Bharat Road Network, Torrent Pharmaceuticals, GE T&D India, AU Small Finance Bank, Motilal Oswal Financial Servicesల్లో సిగ్నిఫికెంట్‌ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Bharat Road Network: గురువాయూర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పూర్తి వాటాను కొనుగోలు చేసినట్టు భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్స్‌ ప్రకటించింది.

Torrent Pharmaceuticals: యూనికెమ్‌ ల్యాబొరేటరీస్‌కు చెందిన భారత్‌, నేపాల్‌లలోని బ్రాండెడ్‌ ఫార్ములేషన్‌ బిజినెస్‌ను కొనుగోలు చేసిన టొరెంట్‌ ఫార్మా

GE T&D India: శుక్రవారం ఈ కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ-2లో నికరలాభం రూ.205 కోట్ల నుంచి రూ.475 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. సోమవారం ఈ స్టాక్‌ వెలుగులోకి వచ్చే అవకాశముంది. 

AU Small Finance Bank: ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో 10 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌కు ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. 

Motilal Oswal Financial Services: శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు అనుగుణంగా ఈ స్టాక్‌ ట్రేడయ్యే అవకాశముంది.Most Popular