నవంబర్ 24 నుంచి 8స్టాక్స్ పై సస్పెన్షన్

నవంబర్ 24 నుంచి 8స్టాక్స్ పై సస్పెన్షన్

వరుసగా రెండు త్రైమాసికాల పాటు లిస్టింగ్ నిబంధనలు పాటించకపోవడంతో.. 8 కంపెనీలపై నిషేధం విధిస్తున్నట్లు.. ఈ నిషేధం నవంబర్ 24 నుంచి అమలులోకి వస్తుందని బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ప్రకటించింది.

ఒకవేళ ఆయా కంపెనీలు నవంబర్ 20లోపు లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా పత్రాలను సమర్పిస్తే.. ఈ ట్రేడింగ్ నిషేధం వర్తించదని బీఎస్‌ఈ తెలిపింది.

అసాహి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్, డెల్మా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డూన్ మెర్కంటైల్, ఫిల్‌ట్రాన్ ఇంజినీర్స్, గుప్తా సింథటిక్స్, నియోకార్ప్ ఇంటర్నేషనల్, నోబుల్‌ ఎక్స్‌ప్లో కెమ్, రెల్సన్ ఇండియా షేర్ల ట్రేడింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లు బీఎస్ఈ ప్రకటించింది.Most Popular