ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడంతో, ఈ 5 స్టాక్స్‌లో మూమెంటం!

ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడంతో, ఈ 5 స్టాక్స్‌లో మూమెంటం!

బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లతో పాటు మిడ్‌క్యాప్స్, స్మాల్‌క్యాప్స్‌ కూడా అక్టోబర్‌ నెలలో చక్కని వృద్ధి నమోదు చేశాయి. ఫ్యూచర్స్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న కదలికలు చూస్తుంటే.. నవంబర్‌లో కూడా కొన్ని స్టాక్స్‌లో మూమెంటం కనిపించే అవకాశం ఉంది. 

 

యస్ బ్యాంక్ | ప్రస్తుత ధర: రూ. 325 
నవంబర్ సిరీస్‌లో స్టాక్ ధరలో మార్పు(%): 5.12 
నవంబర్ సిరీస్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ మార్పు(%): 25.17
ఈ బ్యాంక్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లో ట్రేడర్లు షార్ట్ పొజిషన్స్ పెంచుకున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో యస్ బ్యాంక్ లోన్స్ పరిస్థితి మరింతగా దిగజారింది. న్యూట్రల్‌కు ఈ స్టాక్‌ను డౌన్‌గ్రేడ్ చేసిన మాక్వైరీ.. త్వరలో రీరేటింగ్‌కు పరిశీలిస్తామని చెప్పింది. 

 

వీ-గార్డ్ ఇండస్ట్రీస్| ప్రస్తుత ధర: రూ. 225
నవంబర్ సిరీస్‌లో స్టాక్ ధరలో మార్పు(%): 3.42 
నవంబర్ సిరీస్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ మార్పు(%): 54.37 
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో చక్కని ఫలితాలు ప్రకటించడంతో.. వీగార్డ్ ఫ్యూచర్స్‌లో లాంగ్ పొజిషన్స్ పెరిగాయి. వీ-గార్డ్‌ను ఎలారా క్యాపిటల్ అక్యూములేట్‌ రేటింగ్ ఇచ్చింది. 2020వరకూ కాంపౌండెడ్ పద్ధతిలో 19 శాతం చొప్పున ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది.

 

టైటాన్ కంపెనీ| ప్రస్తుత ధర: రూ. 660
నవంబర్ సిరీస్‌లో స్టాక్ ధరలో మార్పు(%): 8.65 
నవంబర్ సిరీస్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ మార్పు (%): 23.22 
ఈ శుక్రవారం క్యూ2 రిజల్ట్స్ ప్రకటించనుండగా టైటాన్ కౌంటర్‌లో లాంగ్ పొజిషన్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. జీఎస్‌టీ అమలు తర్వాత మార్కెట్ షేర్‌ను టైటాన్ గణనీయంగా పెంచుకుంటోంది. వార్షికంగా జ్యూవెల్లరీ అమ్మకాలు 17 శాతం చొప్పున పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

 

భారత్ ఎలక్ట్రానిక్స్ | ప్రస్తుత ధర : రూ. 183
నవంబర్‌ సిరీస్‌లో స్టాక్ ధరలో మార్పు(%): 8.68 
నవంబర్ సిరీస్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ మార్పు(%): 44.44 
తాజాగా రికార్డు గరిష్టాన్ని తాకిన ఈ కౌంటర్.. సెప్టెంబర్ త్రైమాసికంలో నికరలాభంలో 19 శాతం వృద్ధి కనబరిచింది. అక్టోబర్ 31 రోజునే నవంబర్ ఫ్యూచర్స్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ 42 శాతం పెరిగింది. ఆర్డర్ ఇన్‌ఫ్లోస్ ప్రకారం చూస్తే.. ప్రస్తుతం ఈ కౌంటర్ ఆకర్షణీయమైన వాల్యుయేషన్స్‌తో కనిపిస్తోంది.

 

ఎంఆర్‌పీఎల్ | ప్రస్తుత ధర : రూ. 138
నవంబర్ సిరీస్‌లో స్టాక్ ధరలో మార్పు(%): 5 
నవంబర్ సిరీస్‌లో ఓపెన్‌ ఇంట్రెస్ట్ మార్పు(%): 35.18 
ఈ కంపెనీని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్.. షేర్ స్వాప్ డీల్ ద్వారా విలీనం చేసుకోనుందనే వార్తల కారణంగా లాంగ్ పొజిషన్స్ పెరుగుతున్నాయి. ఎంఆర్‌పీఎల్ షేరుకు కోటక్ సెక్యూరిటీస్ బయ్ రేటింగ్ ఇవ్వగా రూ. 155 టార్గెట్ ధరను కొనసాగిస్తోంది. కంపెనీ లాభదాయకత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.Most Popular