ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (నవంబర్‌ 2)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (నవంబర్‌ 2)

గురువారం ట్రేడింగ్‌లో KIOCL, AU Small Finance Bank, Asian Granito India, Apollo Tyres, Andhra Bankల్లో సిగ్నిఫికెంట్‌ ర్యాలీ వచ్చే ఛాన్స్‌ వుంది. 

KIOCL: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. 

AU Small Finance Bank: చోలమండలం ఎంఎస్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేట్‌ ఏజెంట్‌గా చోలమండలం ఎంఎస్‌ వ్యవహరించనుంది. 

Asian Granito India: కొత్త ప్లాంట్‌ ఏర్పాటు కోసం జాయింట్‌ వెంచర్‌ కుదుర్చుకున్నట్టు ఏషియన్‌ గ్రానిటో ఇండియా తెలిపింది. 

Apollo Tyres: ముడి సరుకు ధర పెరగడంతో రెండో త్రైమాసికంలో ఏకీకృత నికరలాభం 46శాతం క్షీణతతో రూ.140.17 కోట్లుగా నమోదైందని కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఏకీకృత నికరలాభం రూ.259.52 కోట్లుగా ఉంది. 

Andhra Bank: గురువారంనాడు క్యూ-2 ఆర్థిక ఫలితాలను ఆంధ్రాబ్యాంక్‌ విడుదల చేయనుంది. ఫలితాలకు అనుగుణంగా ఈ స్టాక్‌ వెలుగులోకి రానుంది. Most Popular