నవంబర్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు కొత్త ఆప్షన్స్! ఈ ఐపిఓలు, ఫండ్స్‌లో ఏవి బెస్ట్

నవంబర్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు కొత్త ఆప్షన్స్! ఈ ఐపిఓలు, ఫండ్స్‌లో ఏవి బెస్ట్


ప్రస్తుతం మార్కెట్లో ఐపీఓల సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. రూ. వేల కోట్ల ఐపీఓలు వరుసగా వచ్చేస్తున్నాయి. ప్రైమరీ మార్కెట్స్ నుంచి నిధులు సమీకరించగలుగుతున్నాయి. వీటిలో మెజారిటీ ఐపీఓలకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. నవంబర్‌లో కూడా ఈ ట్రెండ్ కొనసాగనుంది. ఈ సారి ఐపీఓలతో పాటు మూడు కొత్త ఫండ్స్ కూడా మొదలుకానుండడం విశేషం.
మహీంద్రా లాజిస్టిక్స్, ఖాదిం ఇండియా, న్యూ ఇండియా అస్యూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఐపీఓలు మార్కెట్ల ద్వారా నిధులను నవంబర్‌లోనే సమీకరిస్తున్నాయి. వీటితోపాటు ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్‌ అయిన యాక్సిస్ మల్టీక్యాప్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న భారత్ 22 ఈటీఎఫ్, 1140 రోజుల క్లోజ్ఎండ్ థిమాటిక్ ఈక్విటీ ఫండ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ హౌసింగ్ ఆపర్చునిటీస్ ఫండ్‌లు మార్కెట్లను తాకనున్నాయి. 


తమ పోర్ట్‌ఫోలియోలో కొత్త ప్రొడక్టులను చేర్చుకునేందుకు ఆసక్తి గల మదుపర్లు వీటిని కన్సిడర్ చేయచ్చని వెల్త్ మేనేజర్స్ చెబుతున్నారు. దీర్ఘకాలం వ్యూహంతో ఉన్నవారు.. కనీసం మూడేళ్ల పాటు పెట్టుబడులను కదల్చకుండా ఉండగలిగేవారే కొత్త ప్రొడక్టుల వైపు చూడాలని చెబుతున్నారు. మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఇలాంటి కొత్త ప్రొడక్ట్ లేకపోయినట్లయితే.. వీటిని పరిశీలించవచ్చని అంటున్నారు.

 

మార్కెట్లోకి వస్తున్న కొత్త పెట్టుబడి సాధనాలు

ఐపీఓలు 
కంపెనీ పేరు                       ప్రైస్ బ్యాండ్    ఇష్యూ ప్రారంభం/ముగింపు    గ్రే మార్కెట్ ప్రీమియం

మహీంద్రా లాజిస్టిక్స్               425-429    అక్టోబర్ 31/ నవంబర్ 2        70-75 
ఖాదిమ్                               745-750    నవంబర్ 2/6                    110-120
న్యూ ఇండియా అస్యూరెన్స్      770-780    నవంబర్ 1/3                      --
హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్         275-290    నవంబర్ 7/9                     20-21

 

న్యూ ఫండ్ ఆఫర్స్
ఫండ్ పేరు                         ఆఫర్ ధర    ఇష్యూ ప్రారంభం/ముగింపు    ఫండ్ రకం
యాక్సిస్ మల్టీక్యాప్ ఫండ్        10        అక్టోబర్ 30/నవంబర్ 13        ఓపెన్ ఎండ్
భారత్ 22 ఈటీఎఫ్                10        నవంబర్ 15/17                   ఈటీఎఫ్
హెచ్‌డీఎఫ్‌సీ హౌసింగ్
ఆపర్చునిటీస్ ఫండ్                10        నవంబర్ 15/30                    క్లోజ్ ఎండ్Most Popular