వాల్యూ ఇన్వెస్టింగ్‌కు పెరిగిన డిమాండ్!

వాల్యూ ఇన్వెస్టింగ్‌కు పెరిగిన డిమాండ్!


మార్కెట్లు ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. రికార్డుల మార్కెట్లో ఇంకా అభివృద్ధి అవకాశాలు ఉన్న స్టాక్స్‌ను వెతికి పట్టుకోవడం కొంత కష్టమైన విషయమే. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది మదుపర్లు ఫిలిప్ ఫిషర్ చెప్పిన గ్రోత్ స్టాక్స్‌కు బదులుగా.. బెంజమిన్ గ్రాహం చెప్పిన వాల్యూ ఇన్వెస్టింగ్ సిద్ధాంతాల వైపు అడుగులు వేస్తున్నారు.
ఆదాయలు యావరేజ్‌గా పెరిగే అవకాశం మాత్రమే ఉండి, పీఈ మల్టిపుల్స్ ప్రకారం తక్కువ ధర వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్‌నే వాల్యూ స్టాక్స్ అని చెప్పవచ్చు. గ్రోత్ స్టాక్స్ వీటికి విరుద్ధంగా.. అంటే మంచి ఆదాయాలకు అవకాశం ఉండి గరిష్ట పీఈ వద్ద ట్రేడవుతుంటాయి. సాధారణంగా బుల్ మార్కెట్‌ను గ్రోత్ స్టాక్స్ నడిపిస్తాయి.
ప్రస్తుతం మన మార్కెట్లు ర్యాలీ చేసీ చేసీ కొంత అలిసిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, భారతీ ఇన్‌ఫ్రాటెల్, లుపిన్, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి వాల్యూ స్టాక్స్.. గత నెల రోజులుగా పాజిటివ్ రిజల్ట్స్‌ను అందించడాన్ని గమనించవచ్చు. జనవరి-సెప్టెంబర్ కాలంలో జరిగిన ర్యాలీలో ఈ స్టాక్స్ నెగిటివ్ రాబడులను అందించాయి. 

 

పెరుగుతోన్న మూమెంటం
కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరుగుదల ఇంకా ఊపందుకోకపోవడంతో.. గ్రోత్ స్టాక్స్ కంటే ఎక్కువ వాల్యూ స్టాక్స్‌కు మూమెంటం పెరుగుతోంది. బీఎస్ఈ 200 స్టాక్స్‌లో సగానికి పైగా పెర్ఫామెన్స్ ట్రెండ్‌లో రివర్సల్‌ను చూపుతున్నాయి. లార్జ్‌క్యాప్‌లో ఇప్పటివరకూ పెరగని స్టాక్స్‌లో ఇప్పుడు సానుకూలత కనిపిస్తోంది. ఇదే సమయంలో ఎక్స్‌పెన్సివ్ స్టాక్స్‌లో నెగిటివ్ ఛేంజ్ కూడా గమనించవచ్చు.
ఐదేళ్ల సగటుకు 20-50 శాతం ప్రీమియంతో గ్రోత్ స్టాక్స్ ట్రేడ్ అవుతుండడంతో, ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. వాల్యుయేషన్స్ ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్న స్టాక్స్‌లో సేఫ్టీ మార్జిన్ చాలా తక్కువగా కనిపిస్తోంది. అందుకే వాల్యూ స్టాక్స్‌పై ఆసక్తి చూపేందుకు మదుపర్లు ఉత్సాహం చూపుతున్నారు. 


ఉదాహరణకు.. లాంగ్‌టెర్మ్ యావరేజ్ కంటే తక్కువ ధరకు ట్రేడవుతున్న ఆటో స్టాక్స్‌లో ఎం అండ్ ఎం కూడా ఒకటి. ప్రస్తుతం గ్రామీణ మార్కెట్‌లో రికవరీ కనిపిస్తుండడంతో.. దేశంలో అతి పెద్ద ట్రాక్టర్ తయారీ కంపెనీ అయిన ఎం అండ్ ఎం.. ఆకర్షణీయంగా మారి వాల్యూ స్టాక్‌గా కనిపిస్తోంది.

వాల్యూ స్టాక్స్ వైపు చూపు
అభివృద్ధికి అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటూ ఉండడంతో, వాల్యూ స్టాక్స్ వైపు మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బ్యాంకుల రీక్యాపిటలైజేషన్, ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, పంటలకు గరిష్టంగా కనీస మద్దతు ధర కారణంగా వినియోగం పెరిగే అవకాశం, ఎన్‌పీఏలు తగ్గేందుకు సహకారం అందిస్తుండడం వంటివి కీలకమైన అంశాలు. రీక్యాపిటలైజేషన్ కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఆకర్షణీయంగా మారాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తన పోర్ట్‌ఫోలియోలో జత చేసుకున్నట్లు సీఎల్ఎస్ఏ వెల్లడించింది.
ఎనర్జీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, మైనింగ్, మెటల్స్ రంగాల్లోని పలు షేర్లు ఏడాది ఫార్వార్డ్ ఎర్నింగ్స్ 13.8 రెట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అంటే నిఫ్టీ వాల్యుయేషన్‌తో పోల్చితే ఇవి 23 శాతం డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. తాజాగా ధరలు కొంత తగ్గినా గ్రోత్ స్టాక్స్ అన్నీ నిఫ్టీ 20-25 శాతం ప్రీమియంతో ఉన్నాయి. 2018 ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్‌కు 18 రెట్ల వద్ద.. లాంగ్‌టెర్మ్ యావరేజ్‌కు 24 శాతం ప్రీమియంతో నిఫ్టీ ట్రేడవుతోంది. 

 

కొన్ని వాల్యూ స్టాక్స్

  • బజాజ్ ఆటో
  • భారతీ ఇన్‌ఫ్రాటెల్
  • సిప్లా
  • ఎం అండ్ ఎం
  • హెచ్‌సీఎల్ టెక్ 
  • ఎన్‌టీపీసీ


Most Popular