ఇన్ఫ్రా థీమ్‌లో కాసులు కురిపించే 5 స్టాక్స్!

ఇన్ఫ్రా థీమ్‌లో కాసులు కురిపించే 5 స్టాక్స్!


దేశంలో మౌలిక రంగానికి మళ్లీ మంచి రోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం తాజాగా ప్రకటించిన భారత్‌మాల ప్రాజెక్టు.. ఈ రంగంలో పెను విప్లవానికి దారి తీయనుంది. రూ. 7 లక్షల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుతో భారతీయ రోడ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. 80 శాతం రోడ్లను ఫ్రైట్ క్యారిడార్లుగా మార్చాలనే ప్రతిపాదన.. భారతీయ రోడ్ల స్వరూపం మార్చేయనుంది. రాబోయే 3-4 ఏళ్లపాటు కొన్ని లిస్టెడ్ కంపెనీలు ఈ ప్రాజెక్టులతో బహుళ ప్రయోజనాలను పొందనున్నాయి. ఈ భారత్‌మాల ప్రాజెక్టుతో లాభపడనున్న 5 స్టాక్స్‌ను పరిశీలిద్దాం.


దిలీప్ బిల్డ్‌కాన్| ప్రస్తుత ధర: రూ. 870.15 | 2017లో పెరుగుదల: 280.98% | పీ/ఈ: 27.42 | 
రోడ్ సెగ్మెంట్‌లో తగినన్ని ప్రాజెక్టులనే దిలీప్ బిల్డ్‌కాన్ గెలుచుకోనుంది. రూ. 15600 కోట్ల స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఈ కంపెనీ సొంతం. ఈ రంగంలో పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఉన్న దిలీప్ బిల్డ్‌కాన్.. రూ. 6.9 లక్షల కోట్ల విలువైన భారత్‌మాల ప్రాజెక్టులో చెప్పికోదగిన స్థాయిలోనే కొత్త ఆర్డర్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

 

అశోకా బిల్డ్‌కాన్ ప్రస్తుత ధర రూ. 214.75 | 2017లో రాబడి : 34.85% | పీ/ఈ: 73.37| 
ట్రాఫిక్ గ్రోత్ విషయంలో ఇదే రంగానికి చెందిన కంపెనీల కంటే అశోకా బిల్డ్‌కాన్ మంచి ప్రదర్శన నమోదు చేస్తోంది. రోడ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించేందుకు ఎస్‌బీఐ మాక్వైరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తగినన్ని నిధులను పొందే అవకాశం ఉంది. ప్రస్తుత స్టాక్ ధర ప్రకారం వాల్యుయేషన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ చెబుతోంది.

 

ఎన్‌సీసీ | ప్రస్తుత ధర: రూ. 107.55 | 2017లో రాబడి: 28.49% | పీ/ఈ: 15.81 | 
ఎన్‌సీసీపై బుల్లిష్‌గా ఉన్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్ వెల్లడించింది. తోటి కంపెనీలతో పోల్చితే ఇన్‌ఫ్రా స్పేస్‌లో రాబోయే కాలంలో మంచి అవకాశాలను ఒడిసిపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ స్టాక్‌పై బయ్ రేటింగ్ కొనసాగిస్తున్నట్లు బ్రోకరేజ్ హౌస్ తెలిపింది. 

 

సద్భావ్ ఇంజినీరింగ్ | ప్రస్తుత ధర: రూ. 316.60 | ఏడాదిలో రాబడి: 15.04% | పీ/ఈ: 39.24 
మాక్రోఎకనామిక్ పరిస్థితులు బలహీనంగా ఉన్నా.. ఆర్డర్లలో ఎక్కువ భాగాన్ని సద్భావ్ ఇంజినీరింగ్ పొందగలిగినట్లు ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. బ్యాంకులతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేయడంతో.. ఎన్‌హెచ్ఏఐ నుంచి ఆర్డర్స్‌ను పొందేటపుడు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు. బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ పోర్ట్‌ఫోలియోలో క్యాష్‌ఫ్లో మెరుగవడం సానుకూలంగా చెప్పవచ్చు.

 

కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్| ప్రస్తుత ధర : రూ. 249.20 | ఏడాదిలో రాబడి: 47.89% | పీ/ఈ: 26.58 
భారత్‌మాల ప్రాజెక్టుతో కేఎన్ఆర్ కూడా ప్రయోజనం పొందనుంది. వచ్చే రెండేళ్లపాటు ఈ కంపెనీ ఆదాయం కాంపౌండెడ్‌గా వార్షిక వృద్ధి 14 శాతం నమోదు చేయవచ్చని ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అంచనా వేస్తోంది. సిస్టమాటిక్ రిస్క్‌లు, ఎగ్జిక్యూషన్ సైకిల్‌లో సర్దుబాటు, మెరుగవుతున్న మార్జిన్స్ ఈ కంపెనీకి సానుకూలం.Most Popular