బాలికలకు భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ స్కాలర్‌షిప్‌లు

బాలికలకు భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ స్కాలర్‌షిప్‌లు

వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు స్కాలర్‌షిప్‌లను భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ అందించింది. దశల వారీగా వెయ్యి మంది బాలికలకు స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్టు, దీనికోసం రూ.2.5 కోట్ల కార్పస్‌ ఫండ్‌ను కేటాయించినట్టు భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుబ్రమణియన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కంపెనీ... తొలిరోజు వందమంది అర్హులకు స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేసింది. మిగిలిన 900 మందికి ఈనెలాఖరులోగా  దశల వారీగా స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

ఈ స్కాలర్‌షిప్‌లను నాలుగు శ్లాబ్‌లలో అందించనున్నట్టు భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ ప్రకటించింది. కనీసంగా స్కాలర్‌షిప్‌ రూ.15 వేలు, గరిష్టంగా రూ.25 వేలను అందించనున్నట్టు తెలిపింది. అయితే ఈ స్కాలర్‌షిప్‌లు కేవలం భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ వద్ద రుణాలు పొందిన 56 లక్షల మహిళా సభ్యుల కుమార్తెలకు మాత్రమే ఇస్తామని సంస్థ వెల్లడించింది.

 Most Popular