బీమా పాలసీ ల్యాప్స్ అయిందా.. ఇలా చేయండి!

బీమా పాలసీ ల్యాప్స్ అయిందా.. ఇలా చేయండి!


మీరు ప్రేమించిన వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు టెర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మించిన సాధనం మరేదీ లేదని చెప్పాల్సిందే. అత్యంత చవకగా గరిష్టమైన సమ్ అస్యూర్డ్ అందించే ఏకైక బీమా పాలసీ ఇదే. మీకు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే, మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించే సాధనం టెర్మ్ ఇన్సూరెన్స్.

వార్షిక ప్రీమియం తక్కువగా ఉండడం, సాధారణ హెల్త్ చెకప్స్‌తో ఎవరైనా మంచి టెర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ పొందడం ద్వారా.. మీ ప్రియమైన వ్యక్తులను ఆర్థిక భద్రతా వలయంలోకి చేర్చవచ్చు.

అయితే, సరైన సమయంలో మీరు ప్రీమియం చెల్లించలేకపోయినపుడు ఏం చేయాలి? మీరు టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పోగొట్టుకున్నట్లేనా లేక ఇచ్చిన సమయంలో తిరిగి పునరుద్ధరించుకోవచ్చా? 

 

బీమా పాలసీ ల్యాప్స్ కావడం ఏంటి?
మీరు ఏ తరహా బీమా పాలసీ కొనుగోలు చేసినా, మీరు తప్పనిసరిగా వార్షికంగా నిర్ణీత మొత్తాన్ని ఆ పథకం గడువు తీరేవరకూ చెల్లించాల్సిందే. ఏవైనా కారణాలతో, బీమా కంపెనీ ఇచ్చిన గ్రేస్ పీరియడ్‌లోగా ప్రీమియం చెల్లించలేకపోతే, మీ పాలసీని నిలిపివేస్తారు. ఎక్స్‌పైర్ అయిన పాలసీని తిరిగి  కొనసాగించే అవకాశం ఉండదు, ప్రత్యామ్నాయంగా మీరు మరొక సరికొత్త పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. సహజంగా ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం. పాలసీదారుని వయసు పెరిగిపోవడంతో ప్రీమియం పెరుగుతుంది. 

జీవిత బీమా పాలసీ పాలసీ ల్యాప్స్ అయితే, అపుడు ఇలా చేయవచ్చు.

 

ల్యాప్స్ అయిన పాలసీని ఎలా రివైవ్ చేయవచ్చు?
మీరు తగిన సమయంలో మీ బీమా పాలసీకి ప్రీమియం చెల్లించకపోయినట్లయితే, మీ పాలసీని గ్రేస్ పీరియడ్ స్థితిలోకి బదలాయిస్తారు. ఈ సమయంలో కూడా సహజంగా పాలసీ అమలులోనే ఉంటుంది, మరణం వంటి సమయాల్లో సమ్ అస్యూర్డ్‌కు క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సహజంగా వార్షిక, అర్ధ వార్షఇక ప్రీమియంలకు 30 రోజులు.. నెలవారీ చెల్లింపులకు 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ గ్రేస్ పీరియడ్‌ను ఒక్కో కంపెనీ ఒక్కోలా నిర్ణయించే అవకాశముంది.

 

పాలసీ ల్యాప్స్ అయినపుడు ఏం జరుగుతుంది?
ఒకవేళ గ్రేస్ పీరియడ్ కూడా పూర్తయిపోయి, దాన్ని తిరిగి యాక్టివ్ చేసేందుకు ఎలాంటి ప్రీమియంలు చెల్లించకపోయినట్లయితే, ఆ పాలసీ ల్యాప్స్ అవుతుంది. పాలసీదారుడు మరణించినా సరే.. లబ్ధిదారులు ఎలాంటి ప్రయోజనం పొందలేరు.

ఒక ఉదాహరణను చూద్దాం. ఒక వ్యక్తి తన టెర్మ్ ప్లాన్‌కు ప్రీమియం చెల్లించడంలో విఫలం అయి.. అతను/ఆమె ఏదైనా యాక్సిడెంట్‌లో మరణించారని అనుకుందాం. గ్రేస్ పీరియడ్ సమయంలో ఈ యాక్సిడెంట్ జరగగా, కుటుంబసభ్యులు క్లెయిమ్ చేసినపుడు, బీమా కంపెనీ తప్పనిసరిగా ప్రయోజనం చెల్లించాల్సిందే. అయితే, పాలసీ ల్యాప్స్ అయిన తరువాత ఈ సంఘటన జరిగినపుడు, ఇన్సూరెన్స్ కంపెనీలు మరణించిన వ్యక్తి కుటుంబానికి ఎలాంటి ప్రయోజనాన్ని చెల్లించవు.

 

పాలసీ పునరుద్ధరణ

అయితే, పాలసీ ల్యాప్స్ అయినంత మాత్రాన అది పూర్తిగా వృథా అయిపోయినట్లు భావించాల్సిన పని లేదు. దీన్ని తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది. అనేక కంపెనీలు ల్యాప్స్ అయిన పాలసీని తిరిగి రివైవ్ చేసేందుకు అవకాశం కల్పిస్తాయి. అయితే, ఇది మరింత ఖరీదు అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాదు.. మెడికల్ చెకప్‌తోపాటు ఒకోసారి పెనాల్టీ మొత్తం కూడా చెల్లించాల్సి రావచ్చు.

ల్యాప్స్ అయిన బీమా పాలసీని తిరిగి యాక్టివ్ స్థితిలోకి తీసుకురావడాన్ని రీఇన్‌స్టేట్మెంట్ అంటారు. ఒక పాలసీకి గ్రేస్ పీరియడ్ కూడా ముగిసిపోయి.. పాలసీదారుడు-ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య కాంట్రాక్ట్ ముగిసిన స్థితిలో మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుంది. ఇలా పాలసీ పునరుద్ధరణ చేసే విధానంలో కంపెనీకి, కంపెనీకి మధ్య అంతరం ఉంటుంది. అలాగే ల్యాప్స్ అయిన తర్వాత జరిగిన సమయం, బీమా పథకం, బీమా ధర వంటి ప్రమాణాల ప్రకారం పాలసీదారులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు

 

అంటే, మీరు ఒకవేళ ప్రీమియం చెల్లించడం మిస్ అయినా సరే, మీరు ఆ పాలసీని పునరుద్ధరించుకుని తిరిగి బీమాను కొనసాగించవచ్చు. అయితే.. ఒక పాలసీకి సకాలంలో చెల్లింపులు చేయడం అనే విషయమే ఎల్లవేళలా ఉత్తమం. 
 Most Popular