ఇల్లు కొనబోతున్నారా! ఈ 10 సూత్రాలు గుర్తుపెట్టుకోండి

ఇల్లు కొనబోతున్నారా!  ఈ 10 సూత్రాలు గుర్తుపెట్టుకోండి

బ్యాంకులు ఇంటి నిర్మాణాల కోసం కానీ, కొత్తగా కొనుక్కోవడానికి కానీ ఇప్పుడు తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తున్నాయి. ఒక్క బ్యాంకులే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు కూడా ఇంట్రస్ట్ రేట్లు తగ్గించాయి. దీంతో సొంతంగా ఇల్లు కొనాలనుకునేవారికి ఇదో మంచి అవకాశంగా కన్పిస్తోంది. నిర్మాణరంగంలో కూడా కొత్త ప్రాజెక్టుల సంగతి పక్కనబెట్టి, ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న భవంతులను అమ్ముకోవాలనే తొందర కన్పిస్తుంది. రియల్ఎస్టేట్  రెగ్యులేటరీ అథారిటీ వంటి కొత్త చట్టంతో ప్రజలకే మేలు కలుగుతుందనే భావన ఉంది. మరి  సొంత ఇల్లు అంటే హ్యపీ హోమ్ కావాలనుకునేవారు కనీసం ఈ కింద చెప్తోన్న పది సూత్రాలు లేదంటే పది విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి

రెరా చూడండి
ముందు రెరా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయాలనుకుంటున్నారో చూడండి. రెగ్యులేటరీ అథార్టీతో సదరు డెవలపర్ రిజిస్టర్ అయ్యారో లేదో చెక్ చేసుకోవాలి.  అలానే అతని సమర్ధత, గత ప్రాజెక్టుల నిర్వహణ కూడా ఆరా తీయాలి.

రెరా సీల్:
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ చట్టం వచ్చిన తర్వాత ప్రతి బిల్డర్ రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా మారింది. అలా బిల్డర్ రిజిస్ట్రేషన్ నంబర్ గమనించాలి.  అలానే రెరా చట్టం చెప్తోన్న అని నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది కూడా చూడాలి. బిల్డింగ్ ప్లాన్ అనుమతి, ఫ్లోర్ల సంఖ్య టవర్లు, రెరా సైట్‌లో బిల్డర్ కి సంబంధించిన అప్‌డేట్స్, రెరా  అనుమతులు ఎన్నింటికి  ఇచ్చింది ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి

టైటిల్:
నిర్మితం కాబోతోన్న ఇల్లు కానీ డ్యూప్లెక్స్ కానీ టైటిల్ ఎవరి  పేరన ఉంది. రెరా రిజిస్ట్రేషన్‌లో నమోదు అయిందా లేదా ఇలాంటి అంశాలు పరిశీలించాలి.రెవెన్యూ డిపార్ట్‌మెంట్ మీరు వాడుకునేలా అనుమతి ఇచ్చిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. కొంతమంది డెవలపర్లు తమ పేరిట లేని ప్లాట్లలో కూడా గతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించి మోసం చేసిన దాఖలాలు అనేకం. అలానే సొంత భూముల్లో ప్లాట్లు వేసినా..వాటికి అన్ని సంస్థల అనుమతి కూడా తప్పనిసరి. అలానే వ్యవసాయభూముల్లో ఇలా ప్లాట్లు వేసినా వాటిని రెసిడెన్షియల్ భూములుగా మార్చాలంటే అనుమతులు తీసుకోవాల్సిందే

ప్రదేశం/ లొకేషన్ 
సరైన ప్రదేశంలో కట్టే ఇళ్లు లేదంటే కట్టబడిన ఇళ్లే కొనుగోలు చేయాలి. ఇంటికి రహదారి వసతితో పాటు ఇతర అమెనిటీస్( నిత్యావసర వస్తువుల సముదాయాలు) స్కూళ్లు హాస్పటల్స్‌ వంటివి దగ్గర్లో ఉండే ఏరియాల్లో ఇళ్లు కొనుగోలు చేయడం మంచిది. అలానే ఇక మీ ఉద్యోగం, వ్యాపారం చేసే చోటుకి దగ్గర్లో చూసుకోవాలనేది మీకు ఇప్పటికే తెలిసిన అంశమే

ఫ్లోర్ ఏరియా రేషియా/ 
డెవలపర్స్ కొన్ని సందర్భాల్లో ఫ్లోర్ ఏరియా రేషియో అదనంగా కొనుగోలు చేస్తారు. దాని అర్ధం ఏంటంటే, అప్రూవ్ అయిన ఏరియా కంటే తర్వాత ఎక్కువ ప్రదేశంలో కట్టడాలు నిర్మిస్తారు. దీంతో ముందు చెప్పిన దానికంటే ఎక్కువ టవర్లు నిర్మిస్తారు. సాధారణంగా ఇవి
గ్రీన్ టవర్లుగా వాడొచ్చు. ఈ విషయంపై ముందు క్లారిటీ తెచ్చుకోవాలి. ఒరిజినల్ లే ఔట్ ప్లాన్‌‌లో బయ్యర్లకి తెలీకుండా ఇలాంటి మార్పులు చేయకూడదు.

కంప్లీషన్ సర్టిఫికెట్
రెడీ టూ మూవ్ అంటే గృహప్రవేశానికి సిధ్దంగా ఉన్న ఫ్లాట్స్ కానీ, ఇళ్లలో కానీ పెట్టుబడి పెట్టాలంటే ప్రాజెక్టు కంప్లీషన్ సర్టిఫికెట్ చూడాలి అది బిల్డర్ దగ్గర ఉందో లేదో కనుగొనాలి. ఈ ఒక్క సర్టిఫికెట్‌లోనే బిల్డర్ ‌దగ్గర ఎన్ని అనుమతులు ఉన్నాయనే అంశం తేలిపోతుంది

అండర్ కన్‌స్ట్రక్షన్ కొనాలా/ లేక పూర్తైన ఇల్లు కొనాలా
ఓ వైపు అద్దె కడుతూ, మరోవైపు ఈఎంఐ కట్టడమనేది ఓ రకంగా హాస్యాస్పదం. అందుకే చాలామంది అప్పటికే పూర్తై, రెడీ టూ ఆక్యుపై ఇళ్లవైపే మొగ్గుచూపుతారు. మీ ఆర్ధిక స్థితినిబట్టి ఈ అంశం నిర్ణయించుకోవచ్చు. అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టుల విషయంలో రెరా యూజర్లకి మంచి రక్షణ కల్పిస్తోంది. ఇచ్చిన టైమ్‌లైన్ లోపు ఇళ్లుకట్టకపోతే పెనాల్టీ బిల్డర్ యూజర్లకి కట్టాల్సి ఉంది. 

రీ సేల్/ డైరక్ట్ పర్ఛేజ్
రీసేల్ ప్రాజెక్టుల విషయంలో బేరం ఆడటానికి వీలుంటుంది. అదే బిల్డర్ దగ్గర డైరక్ట్‌గా కొనుగోలు చేయాలంటే పెద్దగా కుదరకపోవచ్చు. ఐతే ఎలా కొనుగోలు చేసినా పైన చెప్పిన అంశాలన్నీ డాక్యుమెంట్ల రూపంలో సరిచూసుకోవాల్సిందే. రీసేల్ విషయంలో సదరు ఇంటికి సంబంధించిన ఈఎంఐలని అమ్మకందారుడు పూర్తిగా కట్టేశాడా లేదా అనేది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. మెయిన్‌టెనెన్స్‌ల సంస్థలకి కూడా పూర్తి పేమెంట్ చేసారో లేదో తెలుసుకోవాలి.

కేపిటల్ అప్రిషియేషన్
చివరిగా గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు ఇల్లు కొనాలి అంటే మాత్రం అది కేవలం వ్యక్తిగతంగా వాడుకోవడానికే చేయాలి. ఎందుకంటే రియాల్టీ సెక్టార్‌లో కనీసం రెండేళ్లపాటు భారీగా రేట్ల పెరుగుదల ఉండకపోవచ్చని అంచనాలున్నాయి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ కోసమే కాకుండా..ఓ అవసరంగా చూడాలి నిపుణులు చెప్తున్న మాట. Most Popular