రిలయన్స్‌ నిప్పన్‌ ఐపీవో@ రూ. 252

రిలయన్స్‌ నిప్పన్‌ ఐపీవో@ రూ. 252

రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఆర్‌ఎన్‌ఏఎం) పబ్లిక్‌ ఇష్యూ వచ్చే బుధవారం(25న) మొదలుకానుంది. ఈ నెల 27న(శుక్రవారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 247-252గా కంపెనీ ప్రకటించింది. దేశీయంగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ చేపడుతున్న తొలి పబ్లిక్‌ ఇష్యూ ఇది కావడం విశేషం! ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1500 కోట్లను సమీకరించాలని భావిస్తోంది.
జేవీ..
అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ సంస్థ రిలయన్స్‌ కేపిటల్‌... జపాన్‌కు చెందిన నిప్పన్ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ భాగస్వామ్య(జేవీ) ప్రాతిపదికన రిలయన్స్‌ నిప్పన్‌ను ఏర్పాటు చేశాయి. కంపెనీలో నిప్పన్‌ లైఫ్‌ 49 శాతం వాటాను పొందగా... రిలయన్స్‌ కేపిటల్‌కు 46.57 శాతం వాటా ఉంది. ఐపీవో ద్వారా సమీకరించే నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్ల ద్వారా బిజినెస్‌ విస్తరణకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో రిలయన్స్‌ నిప్పన్‌ పేర్కొంది.Most Popular