మహీంద్రా లైఫ్‌కు జేవీ స్పేస్‌

మహీంద్రా లైఫ్‌కు జేవీ స్పేస్‌

అందుబాటు ధరల్లో గృహాల నిర్మాణానికి వీలుగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న వార్తలతో రియల్టీ డెవలపర్‌ మహీంద్రా లైఫ్‌స్పేస్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో గురువారం మూరత్‌ ట్రేడింగ్‌లో 4.3 శాతం జంప్‌చేసింది. రూ. 468 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 472 వరకూ ఎగసింది.
జేవీ ఏర్పాటు
దేశీయంగా చౌక ధరల్లో గృహ నిర్మాణాలకు వీలుగా హెచ్‌డీఎఫ్‌సీ కేపిటల్‌ అడ్వయిజర్స్‌తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు మహీంద్రా లైఫ్‌స్పేస్‌ తాజాగా వెల్లడించింది. మహీంద్రా హ్యాపీనెస్ట్‌ డెవలపర్స్‌ పేరుతో అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించనున్నట్లు తెలియజేసింది. జేవీలో మహీంద్రా వాటా 51 శాతంకాగా.. హెచ్‌డీఎఫ్‌సీకు 49 శాతం లభించనున్నట్లు తెలియజేసింది.Most Popular