నేటి మూరత్‌ ట్రేడింగ్‌ ఇలా!

నేటి మూరత్‌ ట్రేడింగ్‌ ఇలా!

దీపావళి పర్వదినం సందర్భంగా దేశీ స్టాక్ మార్కెట్లలో నేడు మూరత్‌ ట్రేడింగ్‌కు తెరలేవనుంది. బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ సాయంత్రం 6.15 నుంచీ  7.30 వరకూ ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. పావు గంట ప్రీమార్కెట్ సెషన్‌ తరువాత గంటపాటు సాధారణ ట్రేడింగ్‌ సాయంత్రం 6.30నుంచీ మొదలుకానుంది. 
2073 చివరి రోజు ఫ్లాట్
2073 చివరి రోజు బుధవారం మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 24 పాయింట్లు తగ్గి 10,211 వద్ద ముగిసింది. కాగా..  నేటి ట్రేడింగ్‌లో నిఫ్టీకి 10,240-10,268 స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఇదేవిధంగా 10,179-10,147 పాయింట్ల వద్ద మద్దతు లభించగలదని అంచనా వేస్తున్నారు. ఇక 24,314 వద్ద ముగిసిన బ్యాంక్‌ నిఫ్టీకి 24,238-24162 పాయింట్ల వద్ద మద్దతు... 24,422-24,531 స్థాయిల వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని నిపుణులు విశ్లేషించారు. 
డీఐఐల కొనుగోళ్లు
దాదాపు 45 రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) బుధవారం రూ. 1251 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత రెండు రోజుల్లో నగదు విభాగంలో రూ. 500 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌పీఐలకు ధీటుగా గత రెండు రోజుల్లో రూ. రూ. 1050 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) బుధవారం మరోసారి రూ. 904 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. Most Popular