సంవత్ 2073 చివరి రోజు నష్టాలే! 

సంవత్ 2073 చివరి రోజు నష్టాలే! 

నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. సంవత్‌ 2073 చివరి రోజు దేశీ స్టాక్  మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. రోజులో అత్యధిక శాతం ప్రతికూలంగా కదిలిన సెన్సెక్స్‌ చివరికి 25 పాయింట్లు క్షీణించి 32,584 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 24 పాయింట్లు తగ్గి 10,211 వద్ద ముగిసింది. అయితే గత దీపావళి నుంచి చూస్తే నిఫ్టీ 18 శాతం పుంజుకోగా.. సెన్సెక్స్‌ 17 శాతం లాభపడటం విశేషం!
ఎఫ్‌ఎంసీజీ మినహా
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ మాత్రమే(0.25 శాతం) లాభపడగా.. మిగిలిన అన్ని రంగాలూ బలహీనపడ్డాయి. బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా ఇండెక్సులు 1.4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఆటో, మెటల్‌, ఐటీ రంగాలు సైతం 0.4 శాతం స్థాయిలో నీరసించాయి.
డీఐఐల కొనుగోళ్లు
దాదాపు 45 రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం నగదు విభాగంలో రూ. 485 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ఎఫ్‌పీఐలకు ధీటుగా ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మంగళవారం రూ. 809 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.Most Popular