ఆర్‌ఐఎల్‌కు పెట్టుబడుల జోష్‌

ఆర్‌ఐఎల్‌కు పెట్టుబడుల జోష్‌

తూర్పుతీర ప్రాంతంలోని కృష్ణాగోదావరి(కేజీ) బేసిన్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) కౌంటర్‌ ఊపందుకుంది. ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసింది. రూ. 915 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 917 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది.
150 కోట్ల డాలర్లు
యూకే దిగ్గజం బ్రిటిష్‌ పెట్రోలియం(బీపీ)తో కలసి కేజీ బేసిన్‌లో ఇంధన వెలికితీత కార్యక్రమాలకు 150 కోట్ల డాలర్లను(సుమారు రూ. 10,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఆర్‌ఐఎల్‌ పేర్కొంది. 2022కల్లా కేజీ డీ6 బ్లాకులో గల ఆరు గ్యాస్‌ డిస్కవరీల నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేసింది.Most Popular