మార్కెట్ల నామమాత్ర టర్న్‌అరౌండ్‌!

మార్కెట్ల నామమాత్ర టర్న్‌అరౌండ్‌!

తొలి నుంచీ నష్టాల బాటలో సాగుతున్న మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లోకి ప్రవేశించాయి. సెన్సెక్స్‌ 4 పాయింట్లు పెరిగి 32,613కు చేరింది. అయితే నిఫ్టీ నష్టాలలోనే కదులుతోంది. 12 పాయింట్లు క్షీణించి 10,221 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్‌ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.3 శాతం పతనంకాగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1.5 శాతం జారింది. ఫార్మా రంగం దాదాపు 1 శాతం బలహీనపడింది.
చిన్న షేర్లు అక్కడక్కడే
మార్కెట్లు నీరసించడంతో చిన్న షేర్లలోనూ పెద్దగా ఆసక్తి కనిపించడంలేదు. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.15 శాతంచొప్పున బలపడ్డాయి. అయితే ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,300 లాభపడితే.. 1289 నష్టాలతో ఉన్నాయి.Most Popular