యూరప్‌ మార్కెట్లు సానుకూలమే!

యూరప్‌ మార్కెట్లు సానుకూలమే!

కారెఫోర్‌, రెకిట్‌ బెంకిసర్‌, జలాండో తదితర బ్లూచిప్స్‌ ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో యూరొపియన్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ దాదాపు యథాతథంగా కదులుతుంటే.. జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌, యూకే ఇండెక్స్‌ ఫుట్సీ 0.15 శాతం స్థాయిలో లాభపడి ట్రేడవుతున్నాయి.
ఇతర అంశాలు..
స్వాత్రంత్ర్య ప్రకటనను వీడాల్సిందిగా స్పెయిన్‌ కేంద్ర ప్రభుత్వం చేసిన డిమాండ్‌ను కాటలోనియా తిరస్కరించడంతో స్పానిష్‌ మార్కెట్లు మరోసారి ఒత్తిడి ఎదుర్కోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇక బ్రెక్సిట్‌ అంశంపై గురువారం యూకే ప్రధాని థెరెసా మే యూరొపియన్‌ యూనియన్‌ నేతలతో చర్చించనున్నారు. Most Popular