అన్ని రంగాలూ నేలచూపే!

అన్ని రంగాలూ నేలచూపే!

అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపుతుండటంతో మార్కెట్లు నేలచూపులకే పరిమితమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బలహీనంగా మొదలైన మార్కెట్లు ప్రస్తుతం మరింత నీరసించాయి. సెన్సెక్స్‌ 128 పాయింట్లు క్షీణించి 32,481ను తాకగా.. నిఫ్టీ 52 పాయింట్ల వెనకడుగుతో 10,182కు చేరింది. వెరసి సాంకేతిక నిపుణులు కీలకంగా భావించే 10,200 దిగువన ట్రేడవుతోంది.
బ్యాంక్‌ నిఫ్టీ పతనం
పీఎస్‌యూ, ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ స్టాక్స్‌లో భారీ అమ్మకాల కారణంగా ఎన్‌ఎస్ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం పతనంకాగా.. ఫార్మా, ఆటో రంగాలు సైతం 0.75 శాతం చొప్పున నష్టపోయాయి. 
యాక్సిస్‌ బోర్లా 
డెరివేటివ్స్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ 8.2 శాతం కుప్పకూలగా.. ఐసీఐసీఐ, యస్‌బ్యాంక్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, జీ, ఇన్‌ఫ్రాటెల్‌, సిప్లా, ఐడీఎఫ్‌సీ, ఐడియా, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ 4-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఎన్‌సీసీ, పవర్‌గ్రిడ్‌, ఆర్‌ఐఎల్‌, ఐజీఎల్‌, బలరామ్‌పూర్‌, ఆర్‌ఈసీ, ఇన్ఫీబీమ్‌, సిండికేట్‌ బ్యాంక్‌, ఇండిగో, రేమండ్‌ 4-2 శాతం మధ్య ఎగశాయి.Most Popular