ఎంఏఎస్‌ లిస్టింగ్‌ అదుర్స్‌!

ఎంఏఎస్‌ లిస్టింగ్‌ అదుర్స్‌!

వారం రోజుల క్రితం అత్యంత విజయవంతంగా పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ భారీ లాభాలతో స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ.  459కాగా.. బీఎస్ఈలో రూ. 660 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది రూ. 200 లాభంకాగా.. ప్రస్తుతం 40 శాతం వృద్ధితో రూ. 641 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 668 వరకూ ఎగసింది. ఇష్యూకి  ఇన్వెస్టర్లు క్యూకట్టడంతో ఏకంగా 128 రెట్లు అధికంగా సబ్‌స్ర్కయిబ్‌ అయ్యింది. ఇష్యూకి రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం 15 రెట్లకుపైగా దరఖాస్తు చేయడం విశేషం! ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 460 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్‌ ఇన్వస్టర్ల నుంచి సైతం రూ. 136 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.
కంపెనీ పనితీరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ రూ. 104 కోట్ల ఆదాయం సాధించింది. దాదాపు రూ. 24 కోట్ల నికర లాభం ఆర్జించింది. గుజరాత్‌ కేంద్రంగా ఏర్పాటైన కంపెనీ దేశవ్యాప్తంగా నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కార్యకాలాపాలను విస్తరించింది. ప్రధానంగా సూక్ష్మ, మధ్యతరహా సంస్థలతోపాటు మధ్య, తక్కువ ఆదాయ వర్గాలకు రుణాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించింది. Most Popular