దీపావళిలోపు ఈ 3 షేర్లు కొంటే సంక్రాంతిలోపు 50% లాభాలు వస్తాయట!

దీపావళిలోపు ఈ 3 షేర్లు కొంటే సంక్రాంతిలోపు 50% లాభాలు వస్తాయట!

సెంట్రమ్ బ్రోకింగ్ కి సంబంధించిన జే పురోహిత్, ఈ దీవాలికి ఈ మూడు స్టాక్స్ కొంటే రాగల 3-4నెలల్లోనే 50శాతం లాభాలు గ్యారంటీ అని చెప్తున్నారు. అదొక్కటే కాకుండా నిఫ్టీ 10,500 వరకూ వెెళ్లగలదని ఎకనమిక్ టైమ్స్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఒపీనియన్ షేర్ చేశాడు. ఐతే బయ్ ఆన్ డిప్స్ కానీ..సెల్ ఆన్ ర్యాలీస్ కానీ కాకుండా స్టాక్ స్పెసిఫిక్ (సెంట్రిక్) యాక్షన్ కి పరిమితమైతే బెటర్ అని కూడా సూచించాడాయన. టెక్నికల్ పారామీటర్స్ ఆధారంగా ఈ కింది మూడు స్టాక్స్ మంచి లాభాలు పంచుతాయని..అది కూడా చాలా తక్కువ సమయంలోనే రావచ్చని సూచించాడు జే పురోహిత్( జే పురోహిత్ సెంట్రమ్ బ్రోకింగ్ సంస్థ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్)


Parag Milk Foods: CMP: 262.80 | Stop Loss Rs 244 | Target Rs 300 – 315 | Return 20%

2016 మే నెలలో లిస్టైన తర్వాత పరాగ్ మిల్క్ ఫుడ్స్ 50శాతం పెరిగింది. ఆ తర్వాత కరెక్ట్ అయినా కూడా రూ.200-205 మధ్యలో మంచి సపోర్ట్ జోన్ ఏర్పరుచుకుంది. గత వారం ఫాలింగ్ ట్రెండ్ లైన్ నుంచి  బ్రేక్ అవుట్ చూపించింది. ఇక ఆ రేంజ్ పైనే ట్రేడవడం కూడా గమనించవచ్చు. అంతేకాకుండా ఆర్ఎస్ఐ , ఎంఎసిడి గ్రాఫ్ లు కూడా డైలీ, వీక్లీ ఛార్ట్స్ లో పాజిటివ్ సిగ్నల్స్ చూపిస్తోంది.పైన చెప్పిన టెక్నికల్ సిగ్నల్స్ ని బట్టి రానున్న రోజుల్లో పరాగ్ మిల్క్  రూ.300 మార్క్ టచ్ చేస్తుందని జే పురోహిత్ రికమండ్ చేస్తున్నారు. రూ.253కి స్టాక్ పడ్డప్పుడల్లా రూ.244 స్టాప్ లాస్ గా చూసుకుంటూ షేర్ ని అక్వైర్ చేయాల్సిందిగా ఆయనసూచించారు. 

SBI: CMP: 252.10 | Stop Loss Rs 238 | Target Rs 385 – 390 | Return 54%

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు గడచిన మూడు వారాలుగా బాగా అండర్ పెర్ఫామ్ చేస్తోంది. ఐనా రూ.250 వద్ద మంచి సపోర్ట్ తీసుకున్న ఎస్బిఐ షేరు గరిష్ట స్థాయినుంచి 38శాతం నష్టపోయింది. చార్ట్ పరంగా చూస్తే బుల్లిష్ హార్మోనిక్ పాట్రెన్ లో బుల్లిష్ షార్క్ ఫామ్ అయింది. కాబట్టి రూ.242- 247  మధ్య ఈ స్టాక్ కొనుగోలు చేస్తే ఖచ్చితంగా రూ.385వరకూ వెళ్లే అవకాశమున్నట్లు పురోహిత్ సూచిస్తున్నారు. స్టాప్ లాస్ గా రూ.238గా చెప్తున్నారాయన. షార్ట్ టర్మ్ టార్గెట్లుగా రూ.275,285ని చెప్తుండగా..లాంగ్ టర్మ్ లో రూ.385 టచ్ చేసే ఛాన్స్ ఉందని కూడా పురోహిత్ రికమండేషన్.

Suven Life Sciences: CMP Rs 198 | Stop Loss Rs 177 | Target Rs 235 – 245 | Return 23%

గరిష్టస్థాయి నుంచి 61శాతానికి పైగా పడిపోయిన సువెన్ లైఫ్ సైన్సెస్ గత ఏడాది ఫిబ్రవరిలో మంచి ర్యాలీ చూసింది. ఐతే అక్కడ్నుంచి కరెక్షన్ మోడ్ లోనే ఉన్న ఈ కౌంటర్ లో ఇప్పుడు వీక్లీ ఛార్ట్స్ లో హయ్యర్ లోస్ లోయర్  హైస్ మార్క్స్ రిజిస్టర్ చేస్తున్నాయ్. గత 18నెలల కాలపు ఛార్ట్ లో ట్రయాంగిల్ పాటెర్న్ ఫామ్ అయింది. ప్రస్తుతం హెవీ వాల్యూమ్స్ నమోదు అవుతున్నాయ్ కూడా. ఈ సాంకేతిక అంశాలను ఆధారంగా చేసుకుని సువెన్ లైఫ్ సైన్సెస్ వచ్చే నెల రోజుల్లో రూ.235-రూ. 245 వరకూ వెళ్తుందని అనలిస్ట్ అంచనా వేశారు. రూ. 190కి దగ్గర్లో ఈ స్టాక్ ని కొనుగోలు చేస్తే రూ.177ని స్టాప్ లాస్ గా ఎంచుకుని రూ.235-245కి స్టాక్ ధర పెరగవచ్చని జే  పురోహిత్ సూచించారు.

( పైన చెప్పిన స్టాప్ లాస్ లు క్లోజింగ్ బేసిస్ లో చూసుకోవాలి. అలానే పైన స్టోరీలోని షేర్లని ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఇన్ సైట్ రికమండ్ చేయడం లేదు. ఎకనమిక్ టైమ్స్ కి జే పురోహిత్ ఇచ్చిన రికమండేషన్స్ మాత్రమే. కస్టమర్ల లావాదేవీలకు ఆ పై పర్యవసానాలకు సైట్ బాధ్యత వహించజాలదు)Most Popular