షార్ట్‌టెర్మ్‌లో 10 శాతం లాభాలను పంచే స్టాక్స్! 

షార్ట్‌టెర్మ్‌లో 10 శాతం లాభాలను పంచే స్టాక్స్! 

మార్కెట్లు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌లు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ సైతం ఆగస్టు నాటి గరిష్ట స్థాయి దిశగా కదులుతోంది. ఇండెక్స్‌ లో హెవీ వెయిట్‌ స్టాక్స్‌ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇతర ఆటో స్టాక్స్‌ ర్యాలీతో నిఫ్టీ పరుగులు లాభాల రన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో షార్ట్‌ టెర్మ్‌ లో పది శాతం మేర రిటర్న్స్‌ ఇచ్చే టాప్‌ ఫైవ్‌ స్టాక్స్‌ను ఐఐఎఫ్ఎల్ ప్రైవేట్ వెల్త్ టెక్నికల్ నిపుణులు సూచిస్తున్నారు.

మహీంద్రా అండ్ మహీంద్రా 
బయ్, టార్గెట్ : రూ. 1420, స్టాప్ లాస్ : రూ. 1300, రిటర్న్ 6 శాతం
గత ఆగస్టులో ఈ స్టాక్‌ 1434 వద్ద గరిష్ట స్థాయిని అందుకుంది. ఆ స్థాయి నుంచి పతనమైన ఈ షేర్ కింది స్థాయిలో సపోర్ట్‌ లభించడంతో స్థిరంగా ట్రేడవుతోంది. దీంతో మరో సారి స్వల్పకాలంలోనే ర్యాలీ అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ స్టాక్ ఈ వారంలో దాదాపు 3 శాతం లాభపడింది.

ఐడీఎఫ్‌సీ
బయ్, టార్గెట్ : రూ. 73, స్టాప్ లాస్ : రూ. 63, రిటర్న్ 10 శాతం
2015 డిసెంబర్ లో ఈ స్టాక్ గరిష్ట స్థాయి 92 రూ.ల ను టచ్ చేసింది. తర్వాత పతనం అయినప్పటికీ గత రెండు మాసాలుగా ఈ స్టాక్ ధరలో అప్ సైడ్ కనిపిస్తోంది. డిసెంబర్ 2016 లో 50రూ.ల దిగువన ఉన్న ఈ స్టాక్‌లో ఇప్పుడే ర్యాలీ మొదలైంది. 

హావెల్ ఇండియా
బయ్, టార్గెట్ : రూ. 560, స్టాప్ లాస్ 515, రిటర్న్ 5 శాతం
ఈ స్టాక్ గత మే 2017 నాటికి 526రూ.ల స్థాయికి చేరింది. అనంతరం 529 స్థాయిని తాకి అక్కడి నుంచి పతనమైంది. గత వారం ఈ స్టాక్ ట్రెండ్ గమనిస్తే ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

బీఈఎల్
బయ్, టార్గెట్ టార్గెట్ రూ. 182, స్టాప్ లాస్ రూ. 163, రిటర్న్ 7 శాతం
గత డిసెంబర్ 2016 నుంచి  ఈ స్టాక్ లో బలమైన అప్ ట్రెండ్ అనేది కనిపించింది. కానీ ప్రస్తుతం సెప్టెంర్ లో ఈ స్టాక్ 183రూ.ల స్థాయి వరకూ పెరిగి అనంతరం ఆ స్థాయిని నిలుపుకోలేక పతనమై 158 రూ.ల వద్ద స్థిరపడింది. నిపుణుల అంచనా ప్రకారం ఈ వారం నుంచి ఈ స్టాక్ లో బలమైన అప్ ట్రెండ్ ఉండే వీలుంది. 

 

ఇవి కేవలం స్టాక్ బ్రోకింగ్ అనలిస్ట్‌  సిఫార్సులు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత విశ్లేషణ అనంతరం మాత్రమే షేరును కొనుగోలు చేయడం మంచిదనేది ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సూచన.Most Popular