స్టాక్స్‌ టు వాచ్‌ (అక్టోబర్‌ 16)

స్టాక్స్‌ టు వాచ్‌ (అక్టోబర్‌ 16)

ఈ సోమవారం ట్రేడింగ్‌లో గోద్రేజ్‌ అగ్రోవెట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌, జీఎన్‌ఏ యాక్సెల్స్‌, ఐడియా సెల్యూలార్‌లో సిగ్నిఫికెంట్‌ మూమెంట్‌ వచ్చే ఛాన్స్‌ వుంది. 

గోద్రేజ్‌ అగ్రోవెట్‌ : స్టాక్‌మార్కెట్లో  సోమవారం ఈ కంపెనీ లిస్ట్‌ కానుంది. గత వారం ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో 95.41 రెట్ల అధిక స్పందన లభించింది. 

GNA Axles: శుక్రవారం ట్రేడింగ్‌ అనంతరం ఈ కంపెనీ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ స్టాండలోన్‌ నికరలాభం 41.38 శాతం వృద్ధితో రూ.10.66 కోట్లుగా నమోదైంది.

Reliance Industries: క్యూ-2లో కంపెనీ నికరలాభం 12.5 శాతం వృద్ధితో రూ.8,109 కోట్లుగా నమోదైంది. కంపెనీ మొత్తం ఆదాయం 23.9 శాతం వృద్ధితో రూ.1,01,169 కోట్లకు చేరింది.

Godrej Consumer Products: రూ.750 కోట్ల విలువైన వాణిజ్య పత్రాల జారీపై రేటింగ్‌ సంస్థ క్రిసల్‌  “CRISIL A1+” రేటింగ్‌నిచ్చిందని స్టాక్‌ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారమిచ్చింది. 

Idea Cellular: తమ మొబైల్‌ బిజినెస్‌ను వొడాఫోన్‌ ఇండియాలో విలీనం చేసేందుకు అనుమతినిచ్చిన ఐడియా సెల్యూలార్‌ వాటాదారులుMost Popular