బుల్‌ జోష్‌- మార్కెట్ల హైజంప్‌!

బుల్‌ జోష్‌- మార్కెట్ల హైజంప్‌!

మిడ్‌ సెషన్‌ నుంచీ ఒక్కసారిగా బుల్‌ ఆపరేటర్లు పట్టుబిగించడంతో మార్కెట్లు లాభాల పరుగందుకున్నాయి. అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యమివ్వడంతో చివర్లో మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. దీంతో చివరికి సెన్సెక్స్‌ 32,200 పాయింట్ల కీలక స్థాయికి చేరువకాగా.. నిఫ్టీ 10,100 పాయింట్లకు సమీపంలో నిలిచింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 348 పాయింట్లు దూసుకెళ్లి 32,182 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 112 పాయింట్లు జమ చేసుకుని 10,096 వద్ద నిలిచింది.
దాదాపు అన్ని రంగాలూ
ఎన్‌ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్‌, ఫార్మా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, ఐటీ 2-1 శాతం మధ్య జంప్‌చేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్‌, ఆర్‌ఐఎల్‌, సన్‌ ఫార్మా, వేదాంతా, అరబిందో, హెచ్‌యూఎల్‌, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్, యాక్సిస్‌ 6-2 శాతం మధ్య దూసుకెళ్లాయి. కేవలం భారతీ, అల్ట్రాటెక్‌, ఐవోసీ, యూపీఎల్‌, ఎస్‌బీఐ ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.5 శాతం మధ్య నీరసించాయి.Most Popular