చిన్న షేర్ల దూకుడు

చిన్న షేర్ల దూకుడు

ఒక్కసారిగా జోరందుకున్న మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,694 లాభపడితే.. 975 మాత్రమే నష్టపోయాయి.
నెమ్మదించిన ఎఫ్‌పీఐలు
సెప్టెంబర్‌ మొదలు దేశీ స్టాక్స్‌ నుంచి పెట్టుబడుల ఉపసంహరణకే ప్రాధాన్యమిస్తూ వస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) బుధవారం కాస్త నెమ్మదించారు. నగదు విభాగంలో రూ. 108 కోట్ల విలువైన స్టాక్స్‌ మాత్రమే విక్రయించారు. గత 8 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 11,000  కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఎఫ్‌పీఐలకు ధీటుగా గత 8 రోజుల్లో రూ. 11,400 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్ (డీఐఐలు) బుధవారం రూ. 234 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి!Most Popular