గెయిల్‌ ఆర్డర్‌తో మన్‌ అప్పర్‌ సర్క్యూట్‌!

గెయిల్‌ ఆర్డర్‌తో మన్‌ అప్పర్‌ సర్క్యూట్‌!

ప్రభుత్వ రంగ గ్యాస్‌ దిగ్గజం గెయిల్‌ నుంచి భారీ ఆర్డర్‌ను పొందిన వార్తలతో మన్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 18 ఎగసి రూ. 109.55ను తాకింది. 
భారీ ఆర్డర్‌
గెయిల్‌ నుంచి తాజాగా రూ. 925 కోట్ల ఆర్డర్‌ లభించినట్లు మన్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. ఆర్డర్‌లో భాగంగా 1,16,000 మెట్రిక్‌ టన్నుల పైపులను సరఫరా చేయాల్సి ఉంటుందని తెలియజేసింది. జగదీష్‌పూర్‌-హాల్దియా-బొకారో-ధామ్రా పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ కోసం వీటిని సరఫరా చేయాల్సి ఉన్నదని వివరించింది.Most Popular